కొత్త ఆలోచనతో కన్న ఊరికి పయనం.. దాణా బేరంతో కాసుల వర్షం.. ఓ యువకుడి సక్సెస్ స్టోరీ

టాలెంట్ ఉండాలని గానీ ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపించాడు మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు. ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని పశువుల దాణా వ్యాపారంలో లక్షలు గడించాడు.

కొత్త ఆలోచనతో కన్న ఊరికి పయనం.. దాణా బేరంతో కాసుల వర్షం.. ఓ యువకుడి సక్సెస్ స్టోరీ
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 21, 2020 | 9:21 PM

టాలెంట్ ఉండాలని గానీ ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపించాడు మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు. ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని పశువుల దాణా వ్యాపారంలో లక్షలు గడించాడు. ఏ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. రాజ్‌గడ్‌కు చెందిన విపిన్ దంగీ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. మైక్రోబయాలజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. ఆర్థిక సమస్యల మధ్య ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు చదువుకున్నాడు. ఇండోర్‌లోని ఒక ఆసుపత్రిలో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేశాడు. చదువు పూర్తయ్యాక ఫుల్‌టైమ్ పనిలో చేరిపోయాడు. జీతం బాగానే ఉన్నప్పటికీ, ఆ ఉద్యోగంపై అతని మనసు నిలువలేదు. దీంతో ఉద్యోగం వదిలేసి గ్రామానికి తిరిగి వచ్చేశాడు. గ్రామంలో పాల వ్యాపారం ప్రారంభించి లక్షలు కూడబెట్టాడు.

రాజ్‌గడ్‌కు చెందిన విపిన్ దంగీ ఉద్యోగంపై మోజు తగ్గింది. ఉన్న ఊరిలో కన్నవారితో ఉంటూ వ్యాపారం చేయాలని భావించాడు. మొదట పాల వ్యాపారం ప్రారంభించగా రెండు లక్షల రూపాయల వరకూ నష్టం వచ్చిందని విపిన్ తెలిపాడు. దీంతో పశువులకు పోషకాహారం అందించే వ్యాపారం ప్రారంభించాలనే నిర్ణయించుకున్నాడు. ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి కంపెనీ ఎదీ లేకపోవడాన్ని గమనించి, 2019 సెప్టెంబరు నుంచి పశువుల ఆహారం తయారు చేసే పని ప్రారంభించాడు. అయితే, పాడి రైతుల దగ్గరకు దాణాను చేర్చడం పెద్ద సమస్యగా మారిందని, దీంతో మార్కెటింగ్ స్ట్రాటజీ రూపొందించానని తెలిపాడు. ఒక వాహనంలో కొన్ని పశువుల దాణా బస్తాలు వేసుకుని, ఆ వాహనానికి స్పీకర్ అమర్చి ప్రచారం ప్రారంభించి. ఈ పనిలో విజయవంతమయ్యానన్నాడు.

మెల్లమెల్లగా రెగ్యులర్ కస్టమర్ల సంఖ్య మూడు వేలకుపైగా పెరిగింది. దీంతో రోజుకు రెండు నుంచి మూడు టన్నుల పశువుల దాణాను విక్రయిస్తున్నానని విపిన్ తెలిపాడు. ఈ వ్యాపారం బాగా కలిసొచ్చిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం నెలకు ఐదు లక్షల రూపాయలకుపైగా సంపాదిస్తున్నానని విపిన్ తెలిపారు. ఒక టన్ను పశువుల ఆహారం తయారీకి సుమారు 17 వేల వరకూ ఖర్చవుతుందని విపిన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం తన దగ్గర నలుగురు పనిచేస్తున్నారని, త్వరలోనే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లకు కూడా తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు విపిన్ వివరించాడు.