రానా అంత తీసుకుంటున్నాడా.? పవన్ సినిమాకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్న యంగ్ హీరో.

అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ సినిమా కోసం రానా కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకోనున్నాడనేది సదరు వార్త సారంశం.

  • Narender Vaitla
  • Publish Date - 9:15 pm, Mon, 21 December 20
రానా అంత తీసుకుంటున్నాడా.? పవన్ సినిమాకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్న యంగ్ హీరో.

rana high remuneration for next movie: టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో రానా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా సోమవారం ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. దీంతో గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో రానా నటించట్లేదు అంటూ జరుగుతోన్న వార్తకు ఫుల్‌ స్టాప్ పడింది. ఈ సినిమాపై ఇప్పటి నుంచే మంచి బజ్ మొదలైంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ సినిమా కోసం రానా కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకోనున్నాడనేది సదరు వార్త సారంశం. రానా ఈ సినిమాలో నటించేందుకు గాను ఏకంగా రూ. 6 కోట్లు డిమాండ్ చేశాడని తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ కూడా రానా అడిగినంత ఇవ్వడానికి మొగ్గు చూపుతుందని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.