మాస్ మహరాజా.. రవితేజ సరసన ‘బెంగాల్ టైగర్’, ‘టచ్ చేసి చూడు’ వంటి చిత్రాలలో కథానాయికగా నటించిన రాశిఖన్నా ఇప్పుడు మరోసారి అతనితో జతకట్టనుంది. రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందే చిత్రంలో రాశిఖన్నాను ఓ హీరోయిన్ గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో మరో కథానాయికగా నిధి అగర్వాల్ ను తీసుకున్నారు. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు, అందుకే ఇద్దరు కథానాయికలను తీసుకుంటున్నట్టు సమాచారం.
మరోపక్క, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘క్రాక్’ సినిమా షూటింగ్ దశలో ఉంది. లాక్ డౌన్ సమయంలో రవితేజ పలువురు దర్శకులు చెబుతున్న కథలు వింటూ, ఇప్పటికే కొన్ని ప్రాజక్టులకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.