AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏటూరునాగారం అడవుల్లో అరుదైన పాము.. ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా?

Rare snake sighting Eturnagaram: తెలంగాణలోని ఏటూరునాగారం అడవుల్లో అరుదైన, అత్యంత విషపూరిత బాండెడ్ క్రైట్ (కట్టు విరియన్) పాము ప్రత్యక్షమైంది. నలుపు-పసుపు చారలతో కనిపించిన ఈ పాము కాటు ప్రాణాంతకం. ఇంతకుముందు వరంగల్, పాకాల ప్రాంతాల్లోనూ దీని జాడ కనిపించింది. ప్రజలు భయపడకుండా, పామును చంపకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. అరుదైన ఈ సర్పం సంచారంపై అటవీశాఖ అప్రమత్తమైంది.

ఏటూరునాగారం అడవుల్లో అరుదైన పాము.. ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా?
Rare Snake Sighting Eturnagaram
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Sep 10, 2026 | 1:02 PM

Share

Banded Krait Telangana: ఏటూరునాగారం అడవుల్లో అరుదైన పాము ప్రత్యక్షమైంది. తెలంగాణ అడవుల్లో ఇలాంటి చారలు కలిగిన పాము ప్రత్యక్షం కావడం ఆందోళన గురిచేస్తుంది. నలుపు- పచ్చటి చారకలతో ఉన్న ఆ పాము కాటుకు గురైతే ప్రాణాలు దక్కడం అసాధ్యమని అటవీశాఖ సిబ్బంది, వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు. ఏటూరునాగారం శివారు అడవుల్లో ఈ పాము ప్రత్యక్షమైంది. రాత్రి సమయంలో రోడ్డు దాటుతున్న పామును చూసి బాటసారులు ఆందోళన చెందారు. పసుపు – నలుపు చారలు కలిగిన ఇలాంటి పాము సంచారం ఇదే ప్రథమం.

ఈ అరుదైన పామును “బాండెడ్ క్రైట్‌” గా గుర్తించారు. కొద్ది రోజుల క్రితం అచ్చం ఇలాంటి పాము వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో కనిపించింది. పామును చూసి మొదట బొమ్మ అనుకున్నారు.. కానీ దాని కదలికలు గమనించి తీవ్ర భయాందోళన చెందిన స్థానికులు వెంటనే స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు.

అటవీ అధికారులు, స్నేక్ క్యాచర్ అక్కడికి వెంటనే అక్కడికి చేరుకుని పామును పరిశీలించగా, నలుపు–పసుపు చారలతో ఉన్న ఈ పాము బాండెడ్ క్రేట్ (కట్టు విరియన్)గా గుర్తించారు. ఈ పాము దాదాపు 5 అడుగుల పొడవు ఉంది. చాకచక్యంగా పామును పట్టుకొని సమీప అడవుల్లో వదిలేశారు. ఈ పాము విషపూరితమైనదని, సాధారణంగా రాత్రివేళల్లో సంచరిస్తుందని అధికారులు తెలిపారు.

ఈ పాములు కేవలం చైనా, నేపాల్, థాయిలాండ్, కాంబోడియా వియత్నం లాంటి దేశాలలో సంచరిస్తుంది అని తెలిపారు. మనదేశంలో జార్ఖండ్, ఛత్తీస్గడ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అరుదుగా కనిపిస్తుంది. ఈ పాము దారితప్పి లేదా లారీల్లో పడిపోయి ఈ ప్రాంతానికి వచ్చి ఉంటుందని బావిస్తున్నారు. అశోక్ నగర్ ప్రాంతంలో కనిపించడంతో ప్రతిఒక్కరూ ఆశ్చర్యంగా చూశారు.

పాకాల అడవుల్లో ప్రత్యక్షమైన పసుపు- నలుపు చారకలు కలిగిన పాము ఇప్పుడు ములుగు జిల్లా ఏటూరునాగారం అడవుల ప్రత్యక్షమవడం ఆందోళన గురిచేస్తుంది. ఇలాంటి అరుదైన జాతి పాములను చంపవద్దని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. వాటిని చంపకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

పాము వీడియో చూడండి..

Follow Us