చాణక్య నీతి: ఈ లక్షణాలున్న వారితో స్నేహం చేస్తే నష్టమే.. ఫేక్ ఫ్రెండ్స్‌ను ఇలా గుర్తించండి!
10 September 2026
Rajashekher
మీ ముందే మిమ్మల్ని పొగుడుతూ, మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడే వారిని నిజమైన స్నేహితులుగా భావించకూడదు. అవకాశం దొరికితే అలాంటి వారు హాని చేసే అవకాశం ఉందని చాణక్య నీతి చెబుతుంది.
ముందు పొగిడి.. వెనుక చెడుగా..
ఎంత సన్నిహితమైన స్నేహం ఉన్నప్పటికీ, మీ వ్యక్తిగత రహస్యాలన్నింటినీ వారితో పంచుకోవడం మంచిది కాదు. స్నేహం చెడిపోయిన సమయంలో ఆ రహస్యాలు బయటకు వెళ్లే ప్రమాదం ఉంటుంది.
స్నేహితులను గుడ్డిగా నమ్మకండి
మన ఆలోచనలు, విలువలు, స్వభావాలకు దగ్గరగా ఉండే వారితో స్నేహం చేయడం మంచిదని చాణక్యుడు సూచించాడు. ఇలాంటి స్నేహాలు ఎక్కువ కాలం కొనసాగుతాయి.
స్వభావాలు కలిసేవారితో స్నేహం..
తమ అవసరాల కోసం మాత్రమే మన దగ్గరకు వచ్చి, మనకు అవసరమైనప్పుడు దూరంగా వెళ్లిపోయే వ్యక్తులు నిజమైన స్నేహితులు కారు. అలాంటి స్వార్థపూరిత స్నేహాలకు దూరంగా ఉండాలి.
అవసరం ఉన్నప్పుడు మాత్రమే..
మన దగ్గర డబ్బు, పేరు, హోదా ఉన్నప్పుడు చుట్టూ చేరేవారంతా నిజమైన స్నేహితులు కారు. పరిస్థితులు మారినప్పుడు ఎవరు మనతో ఉంటారో అప్పుడే అసలు స్నేహం తెలుస్తుంది.
సంపద, హోదా చూసి చేరేవారిని..
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర కష్టాలు వచ్చినప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టకుండా అండగా నిలిచేవారే నిజమైన స్నేహితులని చాణక్య నీతి చెబుతుంది.
కష్టాల్లో తోడుగా నిలిచేవాడే..
మన తప్పులను ఎత్తిచూపి, అవసరమైనప్పుడు మంచి సలహా ఇచ్చి సరైన మార్గంలో నడిపించేవారే నిజమైన స్నేహితులు. ఎప్పుడూ సంతోషపెట్టడానికి మాత్రమే పొగిడేవారిని జాగ్రత్తగా చూడాలి.
తప్పులను చెప్పి సరైన దారి..
బయటకు ఎంతో మంచిగా, తీయగా కనిపిస్తూ మనసులో మాత్రం చెడు ఉద్దేశాలు పెట్టుకునే వారితో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి నకిలీ స్నేహితులు విషంతో నిండిన పాత్రలో పాలు పోసినట్లే హానికరమని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు.