AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rape Case: భోపాల్‌లో నీచమైన ఘటన.. సవతి తల్లిపై యువకుడు లైంగిక వేధింపులు..

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు తన పినతల్లి(సవతి తల్లి)పైనే అత్యాచారానికి పాల్పడ్డాడు.

Rape Case: భోపాల్‌లో నీచమైన ఘటన.. సవతి తల్లిపై యువకుడు లైంగిక వేధింపులు..
Shiva Prajapati
|

Updated on: Dec 22, 2020 | 12:05 AM

Share

Raped by Stepson: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు తన పినతల్లి(సవతి తల్లి)పైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. జరిగిన దారుణంపై బంధువుల వద్ద గోడు వెళ్లబోసుకుని పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే.. వారు సైతం బాధితురాలిని అడ్డగించారు. మొత్తం మీద ధైర్యం చేసిన మహిళ తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడికి తల్లి చనిపోయింది. దాంతో అతని తండ్రి 24 ఏళ్ల మహిళలను రెండో వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ ఒక కూతురు, కొడుకు జన్మించారు. అయితే మూడేళ్ల క్రితం అతను కూడా చనిపోయాడు. దాంతో అప్పటి నుంచి బాధిత మహిళ తన పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటోంది. అయితే, భర్త మొదటి భార్య కొడుకు అదే ఇంట్లో పైన రూమ్‌లో నివాసముంటున్నాడు. అతనికి పెళ్లి కూడా అయ్యింది. అయితే గత శుక్రవారం రాత్రి నిందితుడు ఆమె గదిలోకి చొరబడ్డాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయినప్పటికీ.. భయపడని బాధిత మహిళ నేరుగా పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Also read:

నీలాకాశంలో అద్భుత ఘట్టం.. గురు – శని మహా సంయోగం. ఒక్కటిగా రెండు పెద్ద గ్రహాలు

‘స్ట్రెయిన్’ వైరస్‌పై స్పందించిన డబ్ల్యూహెచ్ఓ.. అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచన..