హైదరాబాద్‌లో మరో నిర్భయ.. వివస్త్రను చేసి..

ఢిల్లీ నిర్భయ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చే దారుణం.. వివస్త్రను చేసి అత్యాచారానికి ఒడిగట్టిన ఘోరం. ఒళ్లంతా బ్లేడ్‌తో గాట్లు పెట్టిన ఘాతుకం.. ఇలా ఎంతని.. ఏమని.. చెప్పాలి. ఓ వైపు రక్తధారలు.. మరోవైపు బాధితురాలి ఆర్తనాదాలు చూసి.. పైశాచిక ఆనందాన్ని పొందిన ఉన్మాదం వారిది. గంజాయికి బానిసలై అఘాయిత్యానికి ఒడిగట్టిన రాక్షసత్వం వారిది. హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు బానిసై.. జీవితాల్ని ఎలా నాశనం చేసుకుంటున్నారో తెలిపే ఉదంతం ఇది. గాంధీనగర్ పీఎస్ పరిధిలో జరిగింది ఈ దారుణం. మత్తులో […]

హైదరాబాద్‌లో మరో నిర్భయ.. వివస్త్రను చేసి..

Edited By:

Updated on: Mar 09, 2019 | 10:27 AM

ఢిల్లీ నిర్భయ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చే దారుణం.. వివస్త్రను చేసి అత్యాచారానికి ఒడిగట్టిన ఘోరం. ఒళ్లంతా బ్లేడ్‌తో గాట్లు పెట్టిన ఘాతుకం.. ఇలా ఎంతని.. ఏమని.. చెప్పాలి. ఓ వైపు రక్తధారలు.. మరోవైపు బాధితురాలి ఆర్తనాదాలు చూసి.. పైశాచిక ఆనందాన్ని పొందిన ఉన్మాదం వారిది. గంజాయికి బానిసలై అఘాయిత్యానికి ఒడిగట్టిన రాక్షసత్వం వారిది.

హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు బానిసై.. జీవితాల్ని ఎలా నాశనం చేసుకుంటున్నారో తెలిపే ఉదంతం ఇది. గాంధీనగర్ పీఎస్ పరిధిలో జరిగింది ఈ దారుణం. మత్తులో యువత మృగాళ్లుగా ఎలా మారుతున్నారో తెలిపే ఓ ఉదాహరణ. డీబీఆర్ మిల్స్ సమీపంలోని చంద్రానగర్ కాలనీ, లిబర్టీ, ఆయిల్స్ సీడ్స్ కాలనీకి చెందిన కొందరు బాలలు రోజూ గంజాయి తాగుతుంటారు. అయితే.. స్థానికంగా ఉండే ఓ బాలికతో వీరంతా చనువు పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే గంజాయి మత్తులో ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు. అంతేకాకుండా ఆ దృశ్యాలన్నీ ఫోన్లో చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. తన స్నేహితులందరికీ షేర్ చేశాడు.

ఆ వీడియోను తొలగించాని బాలిక నిందితుడిని ప్రాధేయపడింది. అయినా.. కనికరం చూపలేదు. మరోసారి తనను డీబీఆర్ మిల్స్ దగ్గర కలవాలని చెప్పాడు. దీంతో.. స్నేహితుల్ని కలవడానికి వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పి బయటకు వెళ్లింది బాలిక. అయితే.. ఎంతకూ తిరిగిరాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబసభ్యులు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా దారుణ విషయాలన్నీ బయటపడ్డాయి.

కాగా.. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అతని ఫోన్‌లోని వీడియోను డిలీట్ చేశారు. బాలికను వైద్యపరీక్షలకై ఆస్పత్రికి పంపారు. బాధితురాలిపై బ్లేడ్‌తో దాడి చేశారని.. తీవ్ర రక్తస్రావమైందని డాక్టర్లు తెలిపారు.