ఎట్టకేలకు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన ‘బ్యూటిఫుల్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ప్రచార కార్యక్రమంలో వర్మతో పాటు చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా వర్మ ఏపీ రాజధానిపై స్పందించారు. తన దృష్టిలో రాజధాని అన్న పదానికి అర్ధమే లేదన్నారు. ‘ఏ అర్ధం లేనప్పుడు అనకాపల్లిలో ఉంటే ఏంటి?, చెన్నైలో ఉంటే ఏంటి?’ అంటూ తనదైన శైలిలో ప్రశ్నల జల్లు కురిపించారు. రాజధాని అంటే మెయిన్ థియేటర్ లాంటిదన్నారు. ప్రజలకు నేరుగా పాలన అందాలనుకుంటే.. ప్రతి పట్టణనికి ఒక క్యాపిటల్ ఏర్పాటు చేయాలని వర్మ అభిప్రాయపడ్డారు.