యూపీలో భారీ వర్షాలు.. 14 మంది మృతి

| Edited By: Srinu

Jul 13, 2019 | 4:38 PM

ఉత్తరప్రదేశ్‌‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సుమారు తొమ్మిది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ప్రజాజీవనాన్ని ముప్పతిప్పలు పెట్టాయి. భారీగా కురిసిన వర్షాల కారణంగా 14 మంది బలయ్యారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షాలు, వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి అండగా ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. అవసరమైన ప్రాంతాల్లో సహాయక […]

యూపీలో భారీ వర్షాలు.. 14 మంది మృతి
Follow us on

ఉత్తరప్రదేశ్‌‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సుమారు తొమ్మిది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ప్రజాజీవనాన్ని ముప్పతిప్పలు పెట్టాయి. భారీగా కురిసిన వర్షాల కారణంగా 14 మంది బలయ్యారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షాలు, వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి అండగా ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టింది.

రాష్ట్రవ్యాప్తంగా నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. అవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడతూ.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. హతా, రామ్​నగర్​లో 15 సెంటీమీటర్లు, ఫతేపుర్​లో 11, బల్​రామ్​పుర్​, గోరఖ్​పుర్​లో 10, షాజాన్​పుర్​, హైదర్​ఘాట్​, ఎలిజిన్​బ్రిడ్జ్​ ప్రాంతాల్లో 9 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ​ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.