Rainbow Python: అందమైన ఇంద్ర ధనుస్సు రంగులున్న కొండచిలువ.. మైలవ్.. పేరుతో పెంచుకుంటున్న వైనం..

Rainbow Python: హరివిల్లు చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలిసిందే.. దీనికి కారణంలో ఇంద్రధనస్సులోని ఏడు రంగులు. మరి అవే రంగులు పాములు, పక్షులు..

Rainbow Python: అందమైన ఇంద్ర ధనుస్సు రంగులున్న కొండచిలువ.. మైలవ్.. పేరుతో పెంచుకుంటున్న వైనం..
Rainbow Python

Updated on: Oct 22, 2021 | 9:37 AM

Rainbow Python: హరివిల్లు చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలిసిందే.. దీనికి కారణంలో ఇంద్రధనస్సులోని ఏడు రంగులు. మరి అవే రంగులు పాములు, పక్షులు సీతాకోక చిలుకలు అద్దుకుంటే .. అప్పుడు ప్రకృతి మరింత అందంగా దర్శనమిస్తుంది. ఇంద్ర ధనస్సులోని ఏడు రంగులున్న సీతాకోక చిలుక, పక్షులను అప్పుడప్పుడు చూసి ఉంటారు. అదే ఒక పాము.. అదీ కొండచిలువ ఏడు రంగులను సొంతం చేసుకుని కనిపిస్తే.. ఓ వైపు భయం వేసినా.. పాముని మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటాం.. రెయిన్ బో పైథాన్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ అరుదైన రంగురంగుల మైలవ్ అనే పాము కాలిఫోర్నియాలోని ఫౌంటెన్ వ్యాలీలోని ది రిపైల్ జూలో జన్మించింది. జూ యజమాని జే బ్రూవర్ ఈ పైథాన్‌తో ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అరుదైన రంగురంగుల పాముతో తాను ఉన్న వీడియో షేర్ చేసి.. దీనికంటే గొప్పది ఎదిలేదని కాప్షన్ కూడా జత చేశారు. జే బ్రూవర్ తనకు పాములను చాలా ఇష్టమని చెప్పాడు. పాములను సొంత పిల్లలలాగే చూసుకుంటాడు. గత 50 ఏళ్లుగా తాను పాములను పట్టుకునే పనిలో ఉన్నానని చెప్పాడు. జే బ్రూవర్ జంతువుల పట్ల ప్రజల వైఖరిని మారాలని కోరుకుంటున్నాడు. ఈ జంతుప్రదర్శనశాలలో రెటిక్యులేటెడ్ పైథాన్‌లను జాగ్రత్తగా పెంచుతారు.

 

 

Also Read:  నీతివంతుడితో కయ్యం, సర్పంతో నెయ్యం ప్రమాదకరమని చెప్పిన విదురుడు.. ఎందుకంటే..