తెలంగాణ : ఈ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

|

Oct 15, 2020 | 1:06 PM

తీవ్ర వాయుగుండం.. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు, వరదల ప్రభావంతో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

తెలంగాణ : ఈ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
Follow us on

తీవ్ర వాయుగుండం.. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు, వరదల ప్రభావంతో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వరదల ప్రభావంతో రోడ్లు దెబ్బతిన్నాయి.  ఈ వాయుగుండం ప్రభావం ఇంకా వీడలేదు.  గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మెదక్‌, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షాలకు హైదరాబాద్‌ నగరం తడిసి ముద్దయింది. ఎక్కడ చూసినా వరదనీరే దర్శనమిస్తుంది. బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో  భారీ  వర్షం కురిసింది. చార్మినార్‌, కార్వాన్‌, రాజేంద్రనగర్‌, మెహదీపట్నం, సికింద్రాబాద్‌, యూసుఫ్‌గూడ, కుత్బుల్లాపూర్‌, అల్వాల్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్, మూసాపేట్‌, కూకట్‌పల్లితో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ( జీహెచ్ఎంసీ కమిషనర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ )