Railway Board Key Announcement: నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. మూడు విభాగాల్లో సుమారు 1.40 లక్షల ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఆయా పోస్టులకు సంబంధించి తొలిదశ కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను డిసెంబర్ 15వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ 1.40 లక్షల ఉద్యోగాలకు దాదాపు 2 కోట్ల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని.. కరోనా వైరస్ తీవ్రత, లాక్ డౌన్ కారణంగా పరీక్షలు నిర్వహించేందుకు వీలుపడలేదని రైల్వేబోర్డు చైర్మన్ చెప్పారు.
Rlys to conduct first stage of computer-based exams from Dec 15 to fill around 1.40 lakh posts in three categories: Railway Board Chairman
— Press Trust of India (@PTI_News) September 5, 2020
కాగా, అన్‌లాక్ 4.0 నేపథ్యంలో రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల సౌకర్యార్ధం దేశవ్యాప్తంగా మరో 80 రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఈ రైళ్లు నడవనుండగా.. ఈ నెల 10 నుంచి వీటికి రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తుందని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ తెలిపారు. రైళ్లకు ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాలు, వెయిటింగ్ లిస్టు ఎక్కువగా ఉండే చోట్లలో ఈ రైళ్లు నడుస్తాయన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే పరీక్షలకు రైళ్లు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.