దేశవ్యాప్తంగా కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. మెల్లమెల్లగా అన్ని ప్రభుత్వ శాఖల్లోకి విస్తరిస్తోంది. తాజాగా రైల్వే శాఖలో 872 మంది కరోనా బారినపడ్డారు. పలు జోన్లలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వేకు చెందిన సుమారు 872 మంది ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వరకూ కరోనా వల్ల 86 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. వీరిలో 22 మంది ఉద్యోగులు కాగా, మిగిలినవారు వాటి కుటుంబసభ్యలు, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. బాధితులందరిని వెస్ట్రన్ రైల్వేకు చెందిన జగ్జీవన్ రామ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. కోవిడ్-19 రోగుల చికిత్స కోసం రైల్వే శాఖ ఏప్రిల్‌లో ఈ హాస్పిటల్‌ను ప్రత్యేకంగా కేటాయించారు. మరోవైపు కొవిడ్ కేసుల దృష్ట్యా ప్రత్యేక రైల్వే కోచ్ లను కూడా సిద్ధం చేశారు అధికారులు. అత్యధికంగా సెంట్రల్ రైల్వేలో 559 మంది, వెస్ట్రన్ రైల్వే నుంచి 313 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు.