అమేథీలో వెనుకంజ.. వయనాడ్‌లో ముందంజ

| Edited By:

May 23, 2019 | 9:50 AM

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీలో వెనుకంజలో ఉన్నారు. తన ప్రత్యర్థి, కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై దాదాపు 4500 వేల ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. అయితే 2014 ఎన్నికల్లో ఈమె రాహుల్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే రాహుల్ గెలుపునకు కారణమయ్యే లక్ష ఓట్ల మెజార్టీని తగ్గించగలిగారు. కేవలం 1988లో తప్ప.. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలుస్తూ వచ్చారు. ఈ సారి రాహుల్ సీటును కోల్పోయిన పక్షంలో అది ముఖ్యంగా బీజేపీకి ఘన విజయమవుతోంది. కాగా, […]

అమేథీలో వెనుకంజ.. వయనాడ్‌లో ముందంజ
Follow us on

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీలో వెనుకంజలో ఉన్నారు. తన ప్రత్యర్థి, కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై దాదాపు 4500 వేల ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. అయితే 2014 ఎన్నికల్లో ఈమె రాహుల్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే రాహుల్ గెలుపునకు కారణమయ్యే లక్ష ఓట్ల మెజార్టీని తగ్గించగలిగారు. కేవలం 1988లో తప్ప.. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలుస్తూ వచ్చారు. ఈ సారి రాహుల్ సీటును కోల్పోయిన పక్షంలో అది ముఖ్యంగా బీజేపీకి ఘన విజయమవుతోంది.

కాగా, అమేథీ సీటుపై బీజేపీ కన్నేసిన విషయం గమనించిన కాంగ్రెస్ శ్రేణులు… రాహుల్ ను మరో చోటు నుంచి బరిలో దింపాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గంలో రాహుల తమ సమీప అభ్యర్ధి సీపీఐ పీపీ సునేర్‌పై పదివేలకు పైగా ఓట్ల ఆధిక్యత సాధించే దిశలో సాగుతున్నారు.