కాంగ్రెస్ పార్టీలో ‘మినీ ముసలం’, ఎన్ఎస్ యూఐ నేత రుచి గుప్తా రాజీనామా, రాహుల్ అధ్యక్షుడు కావాలని డిమాండ్

కాంగ్రెస్ లో అసమ్మతివాదులు, విధేయులు అంతా పార్టీ అధినేత్రి సోనియా గాంధీతోను, రాహుల్,  ప్రియాంక గాంధీ తోను సమావేశమైన రోజే పార్టీలో 'మినీ ముసలం' వంటిది తలెత్తింది. పార్టీ అనుబంధ..

కాంగ్రెస్ పార్టీలో 'మినీ ముసలం', ఎన్ఎస్ యూఐ నేత రుచి గుప్తా రాజీనామా, రాహుల్ అధ్యక్షుడు కావాలని డిమాండ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 19, 2020 | 8:24 PM

కాంగ్రెస్ లో అసమ్మతివాదులు, విధేయులు అంతా పార్టీ అధినేత్రి సోనియా గాంధీతోను, రాహుల్,  ప్రియాంక గాంధీ తోను సమావేశమైన రోజే పార్టీలో ‘మినీ ముసలం’ వంటిది తలెత్తింది. పార్టీ అనుబంధ విద్యార్ధి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి రుచి గుప్తా రాజీనామా చేశారు. పార్టీ సంస్థాగత మార్పుల్లో జాప్యం జరుగుతున్నందుకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఇలా ఆలస్యం కావడంవల్లే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆమె తన వాట్సాప్ మెసేజ్ లో పేర్కొన్నారు. ఈ సంస్థలో తనకీ పదవినిచ్చినందుకు రుచి గుప్తా… రాహుల్, సోనియా గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ని రాహుల్ మాత్రమే నడపగలరని, మరెవరూ నడపలేరని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ పార్టీకి సమర్ధుడైన అధ్యక్షుడు, సముచిత నిర్ణయాలు తీసుకునే వ్యక్తి ఉండాలని, అలా కాని పక్షంలో ఈ సంస్థ వేర్వేరు దిశల్లో సాగుతుందని రుచి గుప్తా అన్నారు. ఇప్పటికైనా పార్టీ ప్రక్షాళన జరగాలని ఆమె కోరారు. ఈమె వాట్సాప్ మెసేజ్ ని ఓ ఇంగ్లీష్ డైలీ ‘ చాకింగ్ ఔట్ ది కాంగ్రెస్ పార్టీస్ ఎండ్యూరింగ్ రివైవల్’ అనే శీర్షికతో ప్రచురించింది.

కేవలం ఇది ఎన్ ఎస్ యూ ఐ నేత తీసుకున్న నిర్ణయమే అయినా ఈ విద్యార్ధి విభాగంలో ఇది  కాక రేపుతుందని భావిస్తున్నారు. తన రాజీనామా లేఖలో రుచి గుప్తా ప్రకటించినవి ఆమె సొంత అభిప్రాయాలే అయినప్పటికీ . సీనియర్ నేతలు దీన్ని తీవ్రంగా పరిగణించే అవకాశాలున్నాయని ఈ విద్యార్ధి విభాగంలోని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. బహుశా ఈ విభాగంలో మరికొందరు నేతలు కూడా రాజీనామా చేయవచ్చునని అంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం రుచి గుప్తా తీసుకున్న నిర్ణయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..