AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియా ఘోర ఓటమిపై స్పందించిన క్రికెట్ ప్రపంచం.. కనీస ప్రతిఘటన ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించిందంటూ వ్యాఖ్యలు.

భారత్ మ్యాచ్‌పై పట్టు సాధిస్తుందన్న సమయంలోనే ఓటమి అంచులకు చేరడం అటూ అభిమానులతో పాటు, ఇటు క్రికెట్ ప్రపంచం కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బాగా రాణించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేయడంపై పలువురు క్రికెటర్లు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మ్యాచ్ ఫలితంపై ఏవరేమన్నరంటే..

టీమిండియా ఘోర ఓటమిపై స్పందించిన క్రికెట్ ప్రపంచం.. కనీస ప్రతిఘటన ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించిందంటూ వ్యాఖ్యలు.
Narender Vaitla
|

Updated on: Dec 19, 2020 | 8:31 PM

Share

cricket world reacts on india shocking collapse: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆడిలైడ్ జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరజాయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. భారత్ మ్యాచ్‌పై పట్టు సాధిస్తుందన్న సమయంలోనే ఓటమి అంచులకు చేరడం అటూ అభిమానులతో పాటు, ఇటు క్రికెట్ ప్రపంచం కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బాగా రాణించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేయడంపై పలువురు క్రికెటర్లు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మ్యాచ్ ఫలితంపై ఏవరేమన్నరంటే..

సచిన్ తెందుల్కర్.. ‘ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో కనబరిచిన ప్రతిభను చూసి మ్యాచ్ భారత్ చేతుల్లోకి వస్తుందనిపించింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆస్ట్రేలియా టీమ్ ఒక్కసారిగా పుంజుకుంది. టెస్ట్ క్రికెట్‌కు ఉన్న గొప్పతనమే ఇది. మ్యాచ్ ముగిసే వరకు ఫలితం అంతు చిక్కదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ సమర్థవంతంగా భారత్‌ను కట్టడి చేసింది. ఆస్ట్రేలియా టీమ్‌కు శుభాకాంక్షలు’.

సంజయ్ మంజ్రేకర్.. బౌలింగ్‌కు అనుకూలించే పరిస్థితుల్లో భారత జట్టు గత మూడు మ్యాచుల్లోనూ నిరాశపరిచింది. 165, 191, 242, 124, 244, 36.. ఇవి గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో భారత్‌ పరుగులు. డిఫెన్స్‌ చేసే నైపుణ్యాల్ని కోహ్లీసేన మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వీరేంద్ర సెహ్వాగ్.. 49204084041..ఈ ఓటీపీని వీలైనంత తొందరగా మరిచిపోవాలి.

వసీమ్ జాఫర్.. సంతోషం.. దుఃఖంగా ఎలా మారుతుందో ఈ రోజే అనుభవించా.

డేవిడ్ వార్నర్.. రెండో ఇన్నింగ్ ఆస్ట్రేలియా బౌలర్లు సాగించిన జైత్రయాత్రను ఇప్పట్లో ఎవరూ మరిచిపోలేరు. మీ విజయం పట్ల ఆనందంగా ఉంది.

మెక్‌గ్రాత్.. హేజిల్‌వుడ్ 200 వికెట్ల క్లబ్‌లో చేరడం ఎంతో సంతోషంగా. అద్భుత విజయం, ప్రతిభతో 200 వికెట్ల క్లబ్‌లో రావడం ఏ బౌలర్‌కయినా ఆనందాన్ని ఇస్తుంది.