ఎంతపెద్ద మ‌న‌స‌య్యా నీది…మ‌రోసారి లారెన్స్ ఆర్థిక‌సాయం..

|

Apr 26, 2020 | 3:40 PM

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల వ‌ల్ల‌ పని లేక ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించారు హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్. ఒక్కొక్కరికీ 25,000 రూపాయల చొప్పున హైదరాబాద్ లో 10 మందికి, చెన్నై లో 13 మందికి మొత్తం 23 మందికి 5 లక్షల 75 వేల రూపాయలు లారెన్స్ డైరెక్ట్ గా వారి బ్యాంక్ ఖాతాల్లో వేశారు. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ, “డాన్స్ నే ప్రాణంగా భావించి, ప్ర‌స్తుతం స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న […]

ఎంతపెద్ద మ‌న‌స‌య్యా నీది...మ‌రోసారి లారెన్స్ ఆర్థిక‌సాయం..
Follow us on

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల వ‌ల్ల‌ పని లేక ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించారు హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్. ఒక్కొక్కరికీ 25,000 రూపాయల చొప్పున హైదరాబాద్ లో 10 మందికి, చెన్నై లో 13 మందికి మొత్తం 23 మందికి 5 లక్షల 75 వేల రూపాయలు లారెన్స్ డైరెక్ట్ గా వారి బ్యాంక్ ఖాతాల్లో వేశారు. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ, “డాన్స్ నే ప్రాణంగా భావించి, ప్ర‌స్తుతం స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం నా బాధ్యత గా భావించి వారి అకౌంట్ల కు డైరెక్ట్ గా డబ్బు పంపించడం జరిగింది” అన్నారు.

తను పైకి వచ్చిన డాన్స్ ఫీల్డ్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని కష్టకాలంలో ఆదుకుంటూ రాఘవ లారెన్స్ తన పెద్ద మనసు మరోసారి చాటుకున్నారు. కాగా కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటీవ‌ల‌ రాఘ లారెన్స్ రూ.3 కోట్ల విరాళాన్ని ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.