రాఫెల్‌ను భారత్ లో స్వీకరించేది ఇతనే..!

భారత్ అమ్ముల పొదలో మరో బ్రహ్మాస్త్రంలో వచ్చి చేరుతోంది. అత్యంత అధునాతన రఫెల్ యుద్ధ విమానాలు భారత్ లో కాలు మోపబోతున్నాయి. ఫ్రాన్స్ నుండి వస్తున్న ఫైటర్ జెట్ రాఫెల్‌కు ఘనస్వాగతం పలికేందుకు భారత్ ఎయిర్ ఫోర్స్ సిద్దమైంది.

రాఫెల్‌ను భారత్ లో స్వీకరించేది ఇతనే..!
Follow us

|

Updated on: Jul 29, 2020 | 1:20 AM

భారత్ అమ్ముల పొదలో మరో బ్రహ్మాస్త్రంలో వచ్చి చేరుతోంది. అత్యంత అధునాతన రఫెల్ యుద్ధ విమానాలు భారత్ లో కాలు మోపబోతున్నాయి. ఫ్రాన్స్ నుండి వస్తున్న ఫైటర్ జెట్ రాఫెల్‌కు ఘనస్వాగతం పలికేందుకు భారత్ ఎయిర్ ఫోర్స్ సిద్దమైంది. రాఫెల్ మొదటి బ్యాచ్ సోమవారం ఫ్రాన్స్ నుండి బయలుదేరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అల్ దఫ్రా ఎయిర్ బేస్ మీదుగా భారత్ లోని అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకోనున్నాయి. ఫ్రాన్స్ నుంచి వస్తున్న తొలి దఫా రాఫెల్ యుద్ధ విమానాలకు వైమానిక దళానికి చెందిన ఎయిర్ చీఫ్ ఆర్కెఎస్ భదౌరియా ఘన స్వాగతం పలుకనున్నారు.

మొత్తం ఐదు రాఫెల్ విమానాలు అంబాలాకు చేరుకుంటున్నాయి. ఫైటర్ జెట్ రాఫెల్ పైలట్లు 7,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అంబాలా ఎయిర్ బేస్ చేరుకుంటున్నారు. 17 గోల్డెన్ ఆరోస్ కమాండింగ్ ఆఫీసర్ పైలట్లతో విమానాలను తీసుకువస్తున్నారు. కాగా, ఇప్పటికే పైలట్లు ఫ్రెంచ్ దసాల్ట్ ఏవియేషన్ కంపెనీలో పూర్తిస్థాయి శిక్షణ పొందారు. ఐదవ తరం ఫైటర్ జెట్ పోరాట సామర్థ్యాన్ని ఎదుర్కోవడానికి వీలుగా వీరు రాటుదేలారు. రాఫెల్ రాకతో భారత వైమానిక దళం బలం రెట్టింపు కానుంది. అటు, అంబాలా వైమానిక దళం స్టేషన్‌ వద్ద భద్రత అంక్షలను కట్టుదిట్టం చేశారు. అంబాలా పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు చేస్తున్నారు.