శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికురాలు మృతి

| Edited By:

Oct 23, 2019 | 10:39 AM

ఖతార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. బ్యాంకాక్ నుంచి దోహా వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు ఉన్నట్లుండి గుండెపోటుకు గురైంది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసి.. చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. మృతురాలు ఉక్రెయిన్‌కు చెందిన గలైనా కోయెంకా(65) గా  గుర్తించారు. మంగళవారం ఉదయం 1.30గంటల సమయంలో విమానంలో ఆమె అపస్మాకర స్థితిలో కనిపించిందని.. దీంతో వెంటనే శంషాబాద్ […]

శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికురాలు మృతి
Follow us on

ఖతార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. బ్యాంకాక్ నుంచి దోహా వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు ఉన్నట్లుండి గుండెపోటుకు గురైంది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసి.. చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. మృతురాలు ఉక్రెయిన్‌కు చెందిన గలైనా కోయెంకా(65) గా  గుర్తించారు.

మంగళవారం ఉదయం 1.30గంటల సమయంలో విమానంలో ఆమె అపస్మాకర స్థితిలో కనిపించిందని.. దీంతో వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేసి.. ఆసుపత్రికి తరలించినా.. ఆమెను బతికించలేకపోయామని సిబ్బంది తెలిపింది. అయితే కొన్నేళ్ల క్రితం గలైనా కోయెంకాకు బైపాస్ సర్జరీ జరిగిందని సమాచారం. ఇక శవపరీక్షల అనంతరం కోయెంకా మృతదేహాన్ని అదే విమానంలో ప్రయాణిస్తున్న ఆమె బంధువులకు అప్పగించినట్లు ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపారు.