Puri Jagannath Temple : కరోనా వ్యాప్తితో మూతపడిన పూరీ జగన్నాథ ఆలయం ఇవాళ తిరిగి తెరుచుకుంది. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆలయ అధికారులు వెల్లడించారు. కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ చూపించిన వారినే దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
భక్తులు తమ వెంట తీసుకొచ్చిన కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్‌ను ఆలయం బయట సంబంధిత అధికారులకు అందించాల్సి ఉంటుందని తెలిపారు. రోజుకు 15వేల నుంచి 17వేల మంది భక్తులు మందిరంలోకి అనుమతి ఇవ్వనున్నట్లుగా తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ‘మహా ప్రసాదం’లోకి మాత్రం ఎవ్వరినీ అనుమతించడం లేదని అన్నారు.
ఆలయంలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం గతనెల 23న ఈ పుణ్య క్షేత్రాన్ని తెరిచారు. డిసెంబర్ 26-31 వరకు పూరీ మున్సిపాలిటీ నివాసితులకు దర్శనానికి అనుమతించారు. అయితే ఇవాళ్టి నుంచి సామాన్య భక్తుల కోసం ఆలయాన్ని తెరిచారు.
ఇవి కూడా చదవండి..:
రెండు లక్షల మంది లోన్ యాప్ బాధితులు..వేధింపులపై తమిళనాడులో కేసులు..ఇద్దరు చైనీయుల అరెస్ట్
DCGI LIVE Updates : రెండు వ్యాక్సిన్లకు నిపుణుల కమిటీ ఓకే.. అనుమతులపై డీసీజీఐ క్లారిటీ