punith raj guest role in bala krishna movie: నట సింహం బాలక్రిష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో ‘సింహ’, ‘లెజెండ్’ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్లు గానే ఈ సినిమాలో భారీ కాస్టింగ్ ఉండేలా చూసుకుంటున్నారు దర్శకుడు బోయపాటి.
ఇందులో భాగంగానే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌ను నటింపజేయడానికి బోయపాటి సన్నాహాలు చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పునీత్ రాజ్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటించనున్నారని సమాచారం. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ఈ పాత్రలో పునీత్ రాజ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారనేది సదరు వార్త సారాంశం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించేంత వరకు వేచి చూడాలి. ఇదిల ఉంటే ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు మరోవైపు సెంటిమెంట్ కూడా ఉంటుందని గతంలో బోయపాటి తెలిపారు.