టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్‌కు .. యంగ్ టైగర్ వెల్‌కమ్ చెబుతున్నారు. అదేంటి…. టాలీవుడ్‌లో ఇప్పటికే పవర్ స్టార్ ఉన్నారు కదా అని షాక్ అవుతున్నారా..? ఇది తెలుగు పవర్ స్టార్ గురించి కాదండి.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గురించి. సాండల్‌వుడ్‌లో స్టార్ హీరోగా వెలిగిపోతున్న పునీత్ ఇప్పుడు టాలీవుడ్ మీద మనసు పడ్డారు. అందుకే తన ఎంట్రీకి యంగ్ టైగర్ సాయం కోరుతున్నారు పునీత్.
యష్, సుదీప్ లాంటి హీరోలు టాలీవుడ్‌లోనూ క్రేజ్ సొంతం చేసుకోవటంతో పునీత్ రాజ్‌కుమార్ కూడా మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తన లేటెస్ట్ మూవీ యువరత్నను కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ప్రిపరేషన్ మొదలు పెట్టారు. ఎలాగూ తారక్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి తన టాలీవుడ్ ఎంట్రీకి కావల్సినంత క్రేజ్ వస్తుందన్నది పునీత్ కాన్ఫిడెన్స్.
ఇంతకీ తారక్, పునీత్ మధ్య రిలేషన్ ఏంటన్నదేగా మీ డౌట్? అక్కడికే వస్తున్నాం. ఎన్టీఆర్ తెలుగులో చేసిన ఆంద్రావాలా సినిమాను సాండల్‌వుడ్‌లో రీమేక్ చేశారు పునీత్. అప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మొదలైంది. ఆ తరువాత పునీత్ కోసం గాయకుడిగా కూడా మారిన తారక్.. కన్నడలో సాంగ్స్ కూడా పాడారు. ఇప్పుడు పునీత్ టాలీవుడ్ ఎంట్రీకి కూడా తన వంతు సాయం చేసే పనిలో ఉన్నారట మన యంగ్ టైగర్.
Also Read :
బిగ్ బాస్ 4 : మోనాల్ మ్యాజిక్, సీజన్ చివర్లో షాకింగ్ ఓటింగ్, ఆటపై ఫోకస్ పెట్టిన గుజరాత్ బ్యూటీ
హద్దుల్లేని ప్రేమ, ప్రియుడి కోసం పాస్‌పోర్టు లేకుండా ఇండియాలోకి, అరెస్ట్ !