గుడ్ న్యూస్.. కరోనాకు చెక్ పెట్టేందుకు మరో మెడిసిన్ రెడీ..!

|

Jul 11, 2020 | 8:07 PM

భారత్‌లో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. రోజురోజుకూ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) మరో మెడిసిన్‌కు అనుమతించింది.

గుడ్ న్యూస్.. కరోనాకు చెక్ పెట్టేందుకు మరో మెడిసిన్ రెడీ..!
Follow us on

భారత్‌లో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. రోజురోజుకూ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 8 లక్షలు దాటగా.. వైరస్ కారణంగా 22,123 మంది మరణించారు. ఇలాంటి తరుణంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) మరో మెడిసిన్‌కు అనుమతించింది. ఇప్పటికే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న పేషంట్లకు రెమ్‌డెసివిర్ మందును ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సొరియాసిస్‌ను నయం చేసేందుకు ఉపయోగించే ‘ఇటోలీజుమ్యాజ్’ ఇంజెక్షన్‌ను తక్కువ మోతాదులో అత్యవసర సమయంలో కరోనా బాధితులకు వాడేందుకు డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదించింది.

ఈ మందును ప్ర‌ముఖ ఫార్మా కంపెనీ బయోకాన్ సంస్థ తయారు చేయగా.. కరోనాకు చెక్ పెట్టే సైటోకిన్లను విడుదల చేయడంలో ఇది సమర్ధవంతంగా పని చేస్తుందని ఎయిమ్స్‌కు చెందిన పలువురు వైద్యులు గుర్తించారు. అయితే ఈ మందును తీసుకునే ముందు రోగులు రాతపూర్వకంగా అంగీకారం తెలిపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, కరోనా రోగులపై ‘ఇటోలీజుమ్యాజ్’ ఇంజెక్షన్ అద్భుతంగా పని చేస్తుందని ముంబయిలోని నాయర్ ఆసుపత్రి మే నెలలోనే ప్రకటించింది. వెంటిలేటర్ మీద ఉన్న ఇద్దరు కరోనా రోగులకు ప్రయోగాత్మకంగా ఈ డ్రగ్ ఇవ్వగా.. వారు కోలుకున్నారని ప్రకటించింది. ఇక ఈ ఇంజెక్షన్ ఇచ్చే ముందు రోగుల కాలేయం, కిడ్నీల పనితీరు చెక్ చేయాల్సి ఉంటుందని నాయర్ ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. కొందరికి ఒక డోసు సరిపోతుందని.. మరికొందరికి మూడు డోసులు ఇవ్వాల్సి వస్తుందని వారు అన్నారు.

Also Read:

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటికే ఉచితంగా కిట్లు పంపిణీ..

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతీ జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్..!

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!

భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..

ఏపీ ప్రజలకు గమనిక.. ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..