AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. 12వ తరగతి పెండింగ్ పరీక్షలు రద్దు..

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో పంజాబ్‌లో పెండింగ్‌లో పడిన 12వ తరగతి పరీక్షలను ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పట్లో పరీక్షల

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. 12వ తరగతి పెండింగ్ పరీక్షలు రద్దు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 11, 2020 | 1:53 AM

Share

PSEB: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో పంజాబ్‌లో పెండింగ్‌లో పడిన 12వ తరగతి పరీక్షలను ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పట్లో పరీక్షల నిర్వహణ శ్రేయస్కరం కాదని భావించి పంజాబ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిర్వహించిన సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటించనున్నట్లు పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ స్పష్టం చేసింది.

కాగా.. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 15 తర్వాత ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. పంజాబ్‌లో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పంజాబ్‌లో ఇప్పటివరకూ 7,140 కరోనా పాజిటివ్ కేసులు, 183 కరోనా మరణాలు నమోదయ్యాయి.

[svt-event date=”10/07/2020,11:12PM” class=”svt-cd-green” ]

[/svt-event]