
Farmers Protest:రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్న అన్నదాతలు సరికొత్త నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని బురారీలో గల నిరంకారీ సమాగం గ్రౌండ్ లో వారు ఉల్లి పంట వేస్తున్నారు. సుమారు నెలరోజులుగా మేం ఇక్కడ ఈ పంట వేయడానికి సిధ్దపడ్డాం.. ఈ ఉదయం నుంచి నీరు పొసే పనిని ప్రారంభించాం అని వారు చెప్పారు. ఇక్కడ ఉల్లిపంట వేయడం తప్ప మేమేం చేయడం లేదు అని వారు తెలిపారు. ఈ గ్రౌండ్ లో మరిన్ని పంటలు వేస్తామన్నారు.
Delhi: Protesting farmers say they’re using Nirankari Samagam ground in Burari to grow crops.
“Since we’ve been sitting idle for a month during protests, we thought of growing onions as we can use it for our daily cooking. We’ll grow more crops on Burari ground,” says a farmer. pic.twitter.com/hvNOHwVF31
— ANI (@ANI) December 27, 2020
నిజానికి ఈ నిరంకారీ గ్రౌండ్ ని రైతుల ఆందోళనకు అధికారులు అనుమతినిచ్చారు. కానీ అన్నదాతలు ఇలా ఇక్కడ వెరైటీగా ఉల్లిపంట వేయడం సంచలనంగా మారింది. కాగా ఈ నెల 29 న కేంద్రానికి, రైతు సంఘాలకు మధ్య మళ్ళీ చర్చలు జరగనున్నాయి. కేంద్రంతో జరిగే చర్చల సందర్భంగా తాము పాటించాల్సిన వ్యూహంపై ఈ సంఘాలు అప్పుడే సంప్రదింపులు ప్రారంభించాయి.
కాగా రైతు సంఘాలు నాలుగు పాయింట్ల అజెండాను రూపొందించాయి. మా ఉద్యమాన్ని నీరు గార్చేందుకు, ఆందోళనను వక్రీకరించేందుకు జరుగుతున్న యత్నాలను ఆపివేయాలని కేంద్రాన్ని ఈ సంఘాలు కోరాయి. రైతు చట్టాల రద్దుకు విధివిధానాలను సిధ్ధం చేయాలని, అలాగే ముసాయిదా విద్యుత్ సవరణ బిల్లులో మార్పులు చేయాలని సూచించాయి. ఇప్పటివరకు రైతు సంఘాలు కేంద్రంతో అయిదు దఫాల చర్చలు జరిపాయి.
Read More:
11 గంటలకు ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా ఆలయానికి రావాలని వైసీపీ ఎమ్మెల్యే అమర్ సవాల్
పతనమైన అరటి ధరలు.. కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతన్నలు.. కిలో రెండు రూపాయలకే విక్రయం.!