India Vs Australia 2020: ఆస్ట్రేలియాపై రిషబ్ పంత్ సరికొత్త రికార్డు.. దిగ్గజ క్రికెటర్ల సరసన చోటు..
India Vs Australia 2020: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆస్ట్రేలియాపై సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఆ గడ్డపై వరుసగా 8 ఇన్నింగ్స్‌ల్లో 25..

India Vs Australia 2020: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆస్ట్రేలియాపై సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఆ గడ్డపై వరుసగా 8 ఇన్నింగ్స్‌ల్లో 25, అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనతను సాధించాడు. దిగ్గజ క్రికెటర్లు వాలీ హేమండ్, రూసి సుర్తి, వివియన్ రిచర్డ్స్ జాబితాలో పంత్ కూడా చోటు దక్కించుకున్నాడు. గత ఆసీస్ పర్యటనలో 4 టెస్టులు ఆడిన రిషబ్ పంత్.. వరుసగా 25, 28, 36, 30, 39, 33, 159* పరుగులు చేశాడు. దీనితో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా పంత్(350) నిలిచాడు.
కాగా, వృద్ధిమాన్ సాహా స్థానంలో రెండో టెస్టుకు ఎంపికైన పంత్.. కెప్టెన్ రహానే(104*)తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ పైన్‌కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే ఆసీస్‌పై వరుసగా 8 ఇన్నింగ్స్‌లలో 25, అంతకన్నా ఎక్కువ పరుగులు చేశాడు.




