Devender Reddy Passes Away : టీఆర్‌ఎస్‌ ఎన్నారై అధికార ప్రతినిధి దేవేందర్‌రెడ్డి మృతి..

అమెరికా న్యూజెర్సీలో టీఆర్‌ఎస్‌ ఎన్నారై అధికార ప్రతినిధి దేవేందర్‌రెడ్డి మృతి చెందారు. తన పని ముగించుకొని మెయిల్‌ బాక్స్‌లో ఉన్న లెటర్స్‌....

Devender Reddy Passes Away : టీఆర్‌ఎస్‌ ఎన్నారై అధికార ప్రతినిధి దేవేందర్‌రెడ్డి మృతి..

Updated on: Dec 29, 2020 | 12:57 PM

Devender Reddy Passes Away : అమెరికా న్యూజెర్సీలో టీఆర్‌ఎస్‌ ఎన్నారై అధికార ప్రతినిధి దేవేందర్‌రెడ్డి మృతి చెందారు. తన పని ముగించుకొని మెయిల్‌ బాక్స్‌లో ఉన్న లెటర్స్‌ తీసుకునేందుకు బయటికొచ్చిన దేవేందర్‌.. కారులో కూర్చొని ఆన్‌ చేయగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దేవేందర్‌ మృతి చెందారు. దేవేందర్‌..భార్య, ఏడేళ్ల కూతురితో కలిసి న్యూజెర్సీలో నివాసముంటున్నారు.

దేవేందర్‌రెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కర్నాటిపల్లి. దేవేందర్‌ కుటుంబం గత కొన్నేళ్ల క్రితం అమెరికాలో స్థిరపడింది. దేవేందర్‌ మృతి ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక న్యూజెర్సీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులోని బ్యాటరీ పేలుడు వల్లే ప్రమాదం జరిగిందా..? లేక ఇంకేదైనా కారణముందా..? అనే కోణంలో ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నారు.

మరోవైపు దేవేందర్‌ మృతితో అమెరికాలో ఉంటున్న తెలుగువారంతా షాక్‌కు గురయ్యారు. దేవేందర్‌ హఠాన్మారణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.