రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సేకరించిన రెండు కోట్ల సంతకాలు కలిగిన ఓ మెమోరాండం ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సమర్పించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యాన ఓ ప్రతినిధి బృందం గురువారం రాష్ట్రపతి భవన్ కు బయలుదేరింది. ఇదే సమయంలో తాము కూడా అక్కడికి వెళ్లేందుకు ప్రియాంక గాంధీ మరి కొందరు కాంగ్రెస్ ఎంపీలు మార్చ్ నిర్వహించబోగా పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను, వారిని అదుపులోకి తీసుకుని బస్సులో మరో చోటికి తరలించారు. ప్రొటెస్ట్ మార్చ్ నిర్వహించేందుకు అనుమతి లేదని, నగరంలో 144 సెక్షన్ అమలులో ఉందని వారు తెలిపారు. అయితే పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించిన ప్రియాంక గాంధీ..ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది చేసినా దాన్ని ఉగ్రవాద చర్యగా ఈ సర్కార్ పరిగణిస్తోందని ఆరోపించారు. రైతులకు మద్దతుగా మేం మార్చ్ ను నిర్వహించదలిచాం, వీరంతా ఎన్నికైన ఎంపీలు,…రాష్ట్రపతిని కలిసేందుకు వీరికి హక్కుంది అన్నారు. లక్షలాది రైతుల వాణిని వినిపించబోతున్నామని, కానీ ప్రభుత్వానికి ఇది ఇష్టం లేదని ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగార్జు.
కాగా-రాహుల్ నేతృత్వంలో రాష్ట్రపతిని కలిసేందుకు ముగ్గురికి మాత్రమే అనుమతిని ఇచ్చారు.
It is a sin to use the kind of names they (BJP leaders & supporters) used for farmers. If Govt is calling them anti-nationals, then the govt is a sinner: Congress leader Priyanka Gandhi https://t.co/alLztWn5bS pic.twitter.com/t05DbhtfJL
— ANI (@ANI) December 24, 2020