Priyanka Chopra About Kids: భారతీయ సినిమా ప్రపంచంలో ప్రియాంక చోప్రా పేరు తెలియని వారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. కేవలం భారతీయ సినిమాల్లోనే కాకుండా హాలీవుడ్ చిత్రాల్లో, వెబ్ సిరీస్‌లో నటించిన ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది. ఇక అమెరికాకు చెందిన ప్రముఖ పాప్ గాయకుడు నిక్ జోనస్‌ను వివాహం చేసుకోవడంతో హాలీవుడ్ కోడలుగా మారిందీ బ్యూటీ.
ఇక ఇదిలా ఉంటే వివాహం జరిగి రెండేళ్లు గడుస్తోన్నా ప్రియాంక, నిక్ ఇప్పటి వరకు శుభవార్త చెప్పలేదు. తాజాగా మరో బాలీవుడ్ తార అనుష్క శర్మ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఓ ఇంటర్వ్యూలో మీకు ఎంత మంది పిల్లలు కావాలని అడిగారు. ఈ ప్రశ్నకు ప్రియాంక కాస్త ఫన్నీగా సమాధానమిచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ‘నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. వీలైనంత ఎక్కువ మందికి జన్మనివ్వాలని ఉంది. ఓ క్రికెట్ టీమ్ కావొచ్చేమో. క్లారిటీ మాత్రం ఇవ్వలేను’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.