Bus Collided :విజయనగరం జిల్లాలో ప్రైవేటు బస్సు బీభత్సం.. ప్రమాద తీవ్రతకు ఉలిక్కిపడిన స్థానికులు..

విజయనగరం జిల్లాలో ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. జంక్షన్‌లో కారు టర్న్‌ తీసుకోబోతోంది. రోడ్ క్లియరెన్స్‌ కోసం స్లోగా ఆగింది. అంతే.. మృత్యువులా దూసుకొచ్చిందో ప్రైవేట్‌ బస్సు. కారుపైకి దూసుకెళ్లింది..

Bus Collided :విజయనగరం జిల్లాలో ప్రైవేటు బస్సు బీభత్సం.. ప్రమాద తీవ్రతకు ఉలిక్కిపడిన స్థానికులు..
Follow us
Sanjay Kasula

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 10, 2021 | 8:42 PM

Bus Collided : విజయనగరం జిల్లాలో ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. జంక్షన్‌లో కారు టర్న్‌ తీసుకోబోతోంది. రోడ్ క్లియరెన్స్‌ కోసం స్లోగా ఆగింది. అంతే.. మృత్యువులా దూసుకొచ్చిందో ప్రైవేట్‌ బస్సు. కారుపైకి దూసుకెళ్లింది. విజయనగరంలోని కలెక్టరేట్ జంక్షన్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టౌన్‌లోకి వేగంగా ఈ ప్రైవేటు బస్సు దూసుకొచ్చింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వేచి చూస్తున్న ఓ కారును బస్సు వేగంగా ఢీ కొట్టింది. ఆ స్పీడుకు కారు నుజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ కారులో RWS డిఇ సింహాచలం నాయుడు.. JE రమేష్‌గా వారిని గుర్తించారు. యాక్సిడెంట్ అయిన వెంటనే బస్సు డ్రైవర్‌ పారిపోయాడు. ఈ ప్రమాద తీవ్రతకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సును సంఘటనా స్థలంలోనే వదిలేసి డ్రైవర్‌ పరారయ్యాడు. భయాందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఇవి కూడా చదవండి :

వైభవంగా కొమురవెల్లి మల్లన్న కళ్యాణ మ‌హోత్స‌వం.. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు చికెన్ తింటే బర్డ్ ప్లూ వ్యాధి సోకుతుందనే వదంతులు.. ఆంధ్రప్రదేశ్‌లోని పౌల్ట్రీ రైతుల్లో కొత్త ఆందోళన Bitcoin Price : రాకెట్‌లా దూసుకుపోతున్న బిట్ కాయిన్.. 1.46 లక్షల డాలర్లకు చేరుకునే ఛాన్స్..