చికెన్ తింటే బర్డ్ ప్లూ వ్యాధి సోకుతుందనే వదంతులు.. ఆంధ్రప్రదేశ్‌లోని పౌల్ట్రీ రైతుల్లో కొత్త ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు ఒక్క బర్డ్‌ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదు. అయినప్పటికి పుకార్లు షికార్లు చేయడంతో పౌల్ట్రీ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం కన్పిస్తోంది. చికెన్ తింటే బోర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుందనే వదంతులు...

చికెన్ తింటే బర్డ్ ప్లూ వ్యాధి సోకుతుందనే వదంతులు.. ఆంధ్రప్రదేశ్‌లోని పౌల్ట్రీ రైతుల్లో కొత్త ఆందోళన
Follow us

|

Updated on: Jan 10, 2021 | 4:41 PM

Bird Flu Rumors : ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు ఒక్క బర్డ్‌ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదు. అయినప్పటికి పుకార్లు షికార్లు చేయడంతో పౌల్ట్రీ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం కన్పిస్తోంది. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుందనే వదంతులు రావడంతో మార్కెట్లో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో పౌల్ట్రీ రైతుల్లో ఆందోళన నెలకొంది.

పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందో రాదో అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాకపోయినా ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అప్రమత్తమైంది. ప్రతి జిల్లాలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ టీంలను ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ల దగ్గర ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

చికెన్ తింటే బర్డ్ ప్లూ వస్తుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు కారణంగా పౌల్ట్రీ రంగానికి భారీగా నష్టం చేకూరుతుంది అంటున్నారు వ్యాపారస్తులు. ఇలాంటి వదంతులు కారణంగా పౌల్ట్రీ రంగంపై ఆధారపడిన లక్షలాది కుటుంబాల జీవనోపాధి పై ప్రభావం పడుతుందంటున్నారు.

ప్రజల్లో అపోహలు పాకడంతో చికెన్ కొనడం తగ్గించేశారు దీంతో చికెన్ ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు 250 ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ. 180 తగ్గుముఖం పట్టింది. ఇలాగే కొనసాగితే ధరలు మరింత పతనమైయ్యే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వ్యాపారులు అంటున్నారు.

అసలే కోవిడ్‌తో భారీగా నష్టపోయిన పౌల్ట్రీ ఇండస్ట్రీ రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో బర్డ్ ఫ్లూ దెబ్బకు పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా చర్యలు తీసుకోకపోతే పౌల్ట్రీ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుందంటున్నారు. ప్రభుత్వమే దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి పౌల్ట్రీ రైతులు నష్టపోకుండా చూడాలంటున్నారు.

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు ఎక్కడా నమోదు కాలేదు అయితే చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుందనేది అవాస్తవమని డాక్టర్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :