PM Modi Condoles : గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో మెసెజ్ పోస్టు చేసిన ప్రధాని మోదీ.. కేశూభాయ్ పట్ల ఉన్న తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. తన లాంటి ఎందరో కార్యకర్తలను కేశూభాయ్ తీర్చిదిద్దారని అన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడేవారన్నారు. కేశూభాయ్ మరణం తీరని లోటు అని, ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు సంతాపం తెలుపుతున్నానని, కేశూ కుమారుడు భరత్‌తో మాట్లాడినట్లు ప్రధాని మోదీ తన వీడియో ట్వీట్‌లో తెలిపారు.
గుజరాతీ నేలకు చెందిన ప్రియతమ నేత కేశూభాయ్ మరణ వార్తను ఊహించలేకపోతున్నట్లు చెప్పుకొచ్చారు. చాలా దుఖం వేస్తోందని, ఆయన మరణం తనలో మౌనాన్ని నింపినట్లుగా వెల్లడించారు. కేశూజీ మరణం తనకు ఓ తండ్రిని కోల్పోయినట్లు ఉందన్నారు.
Our beloved and respected Keshubhai has passed away…I am deeply pained and saddened. He was an outstanding leader who cared for every section of society. His life was devoted towards the progress of Gujarat and the empowerment of every Gujarati. pic.twitter.com/pmahHWetIX
— Narendra Modi (@narendramodi) October 29, 2020
దేశ భక్తి లక్ష్యంతో కేశూ పనిచేశారని ఆయన వ్యక్తిత్వం, వ్యవహారంలో సౌమ్యత, నిర్ణయాలు తీసుకోవడంలో దృఢ నిశ్చయ శక్తి అచంచలమైందని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కేశూభాయ్.. రైతులు, పేదల కష్టాలను అర్థం చేసుకునేవారన్నారు. కేశూజీ వివిధ హోదాల్లో తన నిర్ణయాలతో రైతులకు ఎంతో మేలు చేశారన్నారు. రైతుల జీవితాలను సులభతరం చేశారన్నారు.
Keshubhai travelled across the length and breadth of Gujarat to strengthen the Jana Sangh and BJP. He resisted the Emergency tooth and nail. Issues of farmer welfare were closest to his heart. Be it as MLA, MP, Minister or CM, he ensured many farmer friendly measures were passed. pic.twitter.com/qvXxG0uHvo
— Narendra Modi (@narendramodi) October 29, 2020