కరోనా ఎఫెక్ట్: మాస్కుల తయారీలో భారత ప్రథమ మహిళ

| Edited By:

Apr 23, 2020 | 4:13 PM

కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. భారత ప్రథమ మహిళ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ సతీమణి సవితా కోవింద్‌ కరోనాపై వ్యతిరేక పోరులో తనవంతు

కరోనా ఎఫెక్ట్: మాస్కుల తయారీలో భారత ప్రథమ మహిళ
Follow us on

కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. భారత ప్రథమ మహిళ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ సతీమణి సవితా కోవింద్‌ కరోనాపై వ్యతిరేక పోరులో తనవంతు చేయూతను అందించారు. కరోనా మహమ్మారిపై భారత్‌ చేస్తున్న కృషికి ఆమె బాసటగా నిలిచారు. నిరాశ్రయుల కోసం బుధవారం రాష్ట్రపతి భవన్‌లోని శక్తి హాత్‌ వద్ద స్వయంగా కుట్టు మిషన్‌పై ఫేస్‌ మాస్క్‌లు కుట్టారు.

కాగా.. కరోనా కట్టడికి సామాజిక దూరం పాటించాలి. ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. వీటిని ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్‌ బోర్డు ద్వారా వివిధ ప్రదేశాలలో ఆశ్రయం పొందుతున్న వారికి అందజేయనున్నారు. సవితా స్వయంగా మాస్కులు తయారు చేస్తూ.. కరోనాపై వ్యతిరేక పోరాటంలో దేశంలోని ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలనే సందేశాన్ని ఇచ్చారు. అయితే మాస్కులు కుడుతున్న సమయంలోనూ ఆమె ముఖానికి మాస్కు ధరించడం విశేషం.

Also Read: కరోనా కట్టడికి.. మూలకణ చికిత్స..!  

Also Read: కరోనా పేషెంట్లకు ఆయుర్వేద చికిత్స..!

Also Read: రంజాన్ నేపథ్యంలో.. దుబాయ్ రాజు.. సంచలన నిర్ణయం..