కరోనా కట్టడికి.. మూలకణ చికిత్స..!

కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. చాల దేశాలు ఈ వైరస్ కు వ్యాక్సీన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన ప్లూరిస్టెమ్‌ థెరప్యూటిక్స్‌ సంస్థ కరోనా సమస్యకు ప్లాసెంటల్‌ ఎక్స్‌పాండెడ్‌ సెల్స్

కరోనా కట్టడికి.. మూలకణ చికిత్స..!
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2020 | 3:25 PM

కోవిద్-19 మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కు వ్యాక్సీన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుత వైరస్ సహా కేవలం ఏడు రకాల వైరస్‌లు మాత్రమే మనుషులకు సోకినట్టు సమాచారం. కరోనాను అరికట్టేందుకు మూలకణ చికిత్స ఔషధమని చెబుతోంది ఇజ్రాయెల్‌కు చెందిన ప్లూరిస్టెమ్‌ థెరప్యూటిక్స్‌ సంస్థ. గర్భస్థ పిండం చుట్టూ ఆవరించి ఉండే మాయ నుంచి తీసిన మూలకణాలతో తాము ఏడుగురు కరోనా పేషెంట్లకు చికిత్స చేయగా.. వారంతా పూర్తిగా కోలుకున్నారని ప్రకటించింది.

కాగా.. ఆరుగురు కోవిద్-19 పేషెంట్లలో నలుగురికి గుండె, మూత్రపిండాల వంటివి కూడా దెబ్బతిన్నాయని.. కొవిడ్‌-19 కారణంగా వారి శ్వాసవ్యవస్థ విఫలమైందని.. అలాంటి పరిస్థితుల నుంచి కూడా వారు కోలుకున్నారని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయోగాల్లో భాగంగా వారు ప్లాసెంటా నుంచి తీసిన కణాలను.. వైరస్‌ సోకినవారి శరీరంలో ప్రవేశపెట్టాక థెరప్యూటిక్‌ ప్రొటీన్లు విడుదల చేసేలా ప్రోగ్రామ్‌ చేశారు.

మరోవైపు.. ఇజ్రాయెల్‌లో తమ ప్రయోగాలు సఫలం కావడంతో అమెరికాలో కూడా.. కరోనా కారణంగా ఆరోగ్యం విషమించిన ఒక వ్యక్తికి ప్లూరిస్టెమ్‌ వైద్యులు ఈ చికిత్స చేశారు.  కాగా.. ఈ కణాల్లో ఉండే ఇమ్యూనో మాడ్యులేటరీ గుణాలు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అతి స్పందనలను తగ్గిస్తాయని ప్లూరిస్టెమ్‌ సీఈవో యాకీ యనయ్‌ తెలిపారు.  ఒక్క ప్లాసెంటాతో 20 వేల మంది కరోనా బాధితులకు నయం చేయొచ్చని ఆయన వెల్లడించారు.