సబ్‌కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్‌కా విశ్వాస్ అనే నినాదం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ఇవాళ ప్రసంగించారు. ఈ సందర్భంగా లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓం బిర్లాను అభినందించారు.
సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘాన్ని ప్రశంసించారు. ఇంత పెద్ద దేశంలో శాంతియుతంగా ఎన్నికలు జరగడం అభినందనీయమని… ఈ ఎన్నికల్లో 61 కోట్ల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకుని రికార్డు సృష్టించారని అన్నారు. యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొగి.. తమ తీర్పును స్పష్టంగా వెల్లడించారని ఆయన అన్నారు. 2014 నుంచి కొనసాగుతున్న ప్రభుత్వానికి మరోసారి అవకాశమిచ్చారన్నారు. ఈ 17వ లోక్‌సభలో చాలా మంది ఎంపీలు కొత్తవారేనని.. అంతేగాక, మహిళా సభ్యుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. నవ భారత నిర్మాణానికి ఇదే నిదర్శనమని కోవింద్ అన్నారు.