ఓ గర్భిణి ప్రభుత్వ ఆస్పత్రిలో నరకం చూసింది. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి గర్భిణి ప్రసవం కోసం వచ్చింది. అయితే గర్భిణికి చికిత్స అందించేందుకు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రి ఆవరణలోనే మహళ ప్రసవించింది. అనంతరం పుట్టిన శిశువు మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందని, ఆస్పత్రి అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ప్రసవం కోసం వచ్చిన సమయంలో వైద్యులెవరు అందుబాటులో లేరని, వైద్యుల కోసం ఆస్పత్రిలో ఎవరిని అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వారు ఆరోపించారు. ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకోకపోతే మరింత ఆందోళన చేస్తామన్నారు.