AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pragathi: ‘ఉ అంటావా మావ’ అంటూ జిమ్ లో స్టెప్పులేసిన ప్రగతి.. నెట్టింట్లో వైరల్ గా మారిన డ్యాన్స్ వీడియో..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం 'పుష్ప'. గతేడాది డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది.

Pragathi: 'ఉ అంటావా మావ' అంటూ జిమ్ లో స్టెప్పులేసిన ప్రగతి.. నెట్టింట్లో వైరల్ గా మారిన డ్యాన్స్ వీడియో..
Pragathi
Basha Shek
|

Updated on: Jan 16, 2022 | 11:14 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప’. గతేడాది డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా విజయంలో సమంత స్పెషల్ సాంగ్ కు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది.  ‘ఉ అంటావా మావ.. ‘ అంటూ  ఆమె వేసిన స్టెప్పులు అభిమానులను ఎంతగానో అలరించాయి. ఇటీవల యూట్యూబ్ లో ఈ సాంగ్ పుల్ వీడియో విడుదల కాగా  కొన్ని గంటల్లోనే రికార్డు వ్యూస్ అందుకుంది. ఇప్పటికీ ఈ పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రముఖులతో పాటు నెటిజన్లు ఈ పాటను అనుకరిస్తూ  షార్ట్స్, రీల్స్ చేస్తున్నారు.  ఇటీవల అషూ రెడ్డి  ఈ సాంగ్ ను రీక్రియేట్ చేసి ఆకట్టుకుంది.   తాజాగా నటి ప్రగతి ‘ఉ అంటావా మావ..’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది.  అనంతరం ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. దీంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.

వర్కవుట్లు చేస్తూ డ్యాన్స్..

తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ప్రగతి. ఇటీవల సినిమాల్లో కనిపించడం తక్కువైనా సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటుందీ సీనియర్ నటీమణి. ముఖ్యంగా లాక్‌డౌన్‌ నుంచి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన ప్రగతి అప్పటి నుంచి తరచూ ఫిటినెస్‌ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటోంది. అప్పుడప్పుడు ఫ్యాషనబుల్ ఫొటోలతో పాటు కొన్ని డ్యాన్స్ వీడియోలను  అభిమానులతో షేర్ చేసుకుంటోంది.   ఇప్పుడు కూడా జిమ్ లో వర్కవుట్లు చేసిన తర్వాతే ‘ఉ అంటావా మావ.. ‘  అంటూ మాస్ స్టెప్పులు వేసింది.

Also Read: వైట్ అండ్ వైట్ లో అదరగొట్టిన నాగ చైతన్య లేటెస్ట్ ఫొటోస్ వైరల్

అందాలతో కనువిందు చేస్తోన్న కేతిక శర్మ.. వైరల్ ఫొటోస్

Health Tips: టీకి బదులుగా ఈ కషాయాలు తాగండి.. ఇన్ఫెక్షన్లను మీ దరి చేరనివ్వవు..!

Follow Us
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..