Prabhas To Unleash Zombie Reddy Big Bite : ప్రభాస్ చేతుల మీదుగా ‘జాంబీ రెడ్డి’ బిగ్ బైట్

హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన 'అ' సినిమాతో అందరిని ఆకట్టుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. 'అ' సినిమా తర్వాత రాజశేఖర్ తో కలిసి 'కల్కి' ..

Prabhas To Unleash Zombie Reddy Big Bite : ప్రభాస్ చేతుల మీదుగా 'జాంబీ రెడ్డి' బిగ్ బైట్
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 31, 2020 | 5:19 PM

prabhas : హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన ‘అ’ సినిమాతో అందరిని ఆకట్టుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘అ’ సినిమా తర్వాత రాజశేఖర్ తో కలిసి ‘కల్కి’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకూడా పర్వాలేదనిపించుకుంది. తాజాగా ప్రశాంత్ వర్మ డిఫరెంట్ కథతో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ‘జాంబీ రెడ్డి’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప‌లు చిత్రాల్లో బాల న‌టుడిగా న‌టించిన తేజ స‌జ్జ జాంబీ రెడ్డి చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. దక్ష‌, ఆనంది హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల స‌మంత చేతుల మీదుగా విడుదలైన టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. న్యూయ‌ర్ గిఫ్ట్‌గా జ‌న‌వ‌రి 2న ప్ర‌భాస్ చేతుల మీదుగా బిగ్ బైట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యాయంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సపోర్ట్ చేయడంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. మరి ప్రభాస్ చేతులమీదుగా విడుదల చేసే బిగ్ బైట్ ఎలా ఉంటుందో చూడాలి.

ALSO READ :Sonu Sood : సోనూసూద్‌‌‌‌‌‌‌‌ని ఆశ్చర్యానికి గురిచేసిన దివ్యాంగ బాలుడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో