ఒకే ఫ్రేమ్‌లో ప్రభాస్‌, హృతిక్‌.. ‘ధూమ్ 4’కు రంగం సిద్ధం..!

ఇండస్ట్రీలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న మాస్ హీరోల్లో హృతిక్ రోషన్, ప్రభాస్‌లు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. ఇద్దరి కటౌట్లు చాలు.. ప్రేక్షకులను థియేటర్ల వరకు రెప్పించడానికి..

ఒకే ఫ్రేమ్‌లో ప్రభాస్‌, హృతిక్‌.. ధూమ్ 4కు రంగం సిద్ధం..!

Updated on: Aug 26, 2020 | 4:59 PM

Dhoom 4 Movie Soon: ఇండస్ట్రీలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న మాస్ హీరోల్లో హృతిక్ రోషన్, ప్రభాస్‌లు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. ఇద్దరి కటౌట్లు చాలు.. ప్రేక్షకులను థియేటర్ల వరకు రెప్పించడానికి.. అలాంటిది వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే.? బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయమే. ఇక ఇది త్వరలోనే నిజం కాబోతోంది.

‘వార్’ మూవీని నిర్మించిన యష్ రాజ్ సంస్థ.. త్వరలోనే ‘ధూమ్ 4’ను పట్టాలెక్కించే‌ ప్లాన్‌లో ఉన్నారట. యష్ రాజ్ ఫిలిమ్స్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సూపర్ హిట్ ధూమ్ సిరీస్ సీక్వెల్‌లో హృతిక్‌తో పాటు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ను నటింపజేయాలని నిర్మాత అనుకుంటున్నాడట. ఇందుకోసం సంప్రదింపులు జరపాలని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్‌కు వరల్డ్ వైడ్ మార్కెట్ ఉంది.. అంతేకాకుండా బాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ ఉండటంతో.. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే పక్కా బడా బ్లాక్ బస్టర్ ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మరి యష్ రాజ్ సంస్థ ప్రభాస్‌ను ఒప్పిస్తారో లేదో వేచి చూడాలి. కాగా, ప్రభాస్‌ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’లో నటిస్తున్నాడు. అంతేకాకుండా నాగ్ అశ్విన్‌తో ఓ చిత్రం, అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!

వరద బాధితులకు ఏపీ సర్కార్ చేయూత..!

వృత్తి పన్ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..