AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Potato Pickle Recipe: మామిడికాయ, నిమ్మకాయ కాదు.. ఆలుగడ్డలతో అదిరిపోయే ఊరగాయ ఇలా చేయండి!

సాధారణంగా ఊరగాయ అంటే మనకు ముందుగా మామిడికాయ, నిమ్మకాయ, ఉసిరికాయ, టమాటా వంటి వాటే గుర్తుకొస్తాయి. కానీ ఆలుగడ్డలతో కూడా ఎంతో రుచికరమైన ఊరగాయను తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని సింపుల్ పదార్థాలతోనే ఈ వెరైటీ ఊరగాయను సిద్ధం చేసుకోవచ్చు. అన్నం, పెరుగు అన్నం, పప్పు అన్నంతో పాటు దీనిని తింటే రుచి మరింత పెరుగుతుంది.

Potato Pickle Recipe: మామిడికాయ, నిమ్మకాయ కాదు.. ఆలుగడ్డలతో అదిరిపోయే ఊరగాయ ఇలా చేయండి!
Aloo Pickle Recipe
Bhavani
|

Updated on: Sep 01, 2026 | 4:39 PM

Share

ఆలుగడ్డలతో ఎప్పుడూ కూరలు, ఫ్రైలు మాత్రమే కాకుండా ఈసారి కొత్తగా ఊరగాయను తయారు చేసి చూడండి. ఎక్కువ సమయం తీసుకోకుండా సులభంగా తయారు చేసుకునే ఈ రెసిపీ స్పైసీగా, పుల్లగా, కొద్దిగా తీపి రుచితో అదిరిపోతుంది. మరి ఆలుగడ్డలతో ఈ టేస్టీ ఊరగాయను ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు

ఆలుగడ్డలు – 2

ఆవాల పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు

నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు

కారం – 1½ టేబుల్ స్పూన్లు

మెంతులు – ½ టీస్పూన్

పసుపు – ½ టీస్పూన్

బెల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు

ఉప్పు – తగినంత

తాలింపు కోసం

నూనె – 2 టేబుల్ స్పూన్లు

ఆవాలు – ½ టీస్పూన్

ఇంగువ – ⅓ టీస్పూన్

తయారీ విధానం

ముందుగా ఆలుగడ్డలను తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

ఒక గిన్నెలో ఆవాల పేస్ట్, నిమ్మరసం, కారం, పసుపు, వేయించి పొడి చేసిన మెంతులు, బెల్లం తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి.

తర్వాత పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ తాలింపును మసాలా మిశ్రమంలో కలపాలి.

చివరగా ఆలుగడ్డ ముక్కలను మసాలాలో వేసి బాగా కలపాలి. ఆలుగడ్డ ముక్కలకు మసాలా మొత్తం పట్టేలా కలిపితే రుచికరమైన ఆలుగడ్డ ఊరగాయ సిద్ధమవుతుంది.

Follow Us
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ
70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ
రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!
రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!
రైతన్నలకు తీపి కబురు.. ఈ జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు!
రైతన్నలకు తీపి కబురు.. ఈ జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు!