అడవి జిల్లాలో వెలిసిన మావోయిస్టుల పోస్టర్లు..అధికారులను టార్గెట్ చేస్తూ కాగజ్‌నగర్‌ పట్టణ కేంద్రంలో బ్యానర్

|

Dec 15, 2020 | 6:21 PM

భూ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు అధికారులు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ మావోయిస్టు పార్టీ పేరిట కాగజ్‌నగర్‌ పట్టణ కేంద్రంలో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. కొత్త రెవెన్యూ చట్టాలను ఆసరాగా...

అడవి జిల్లాలో వెలిసిన మావోయిస్టుల పోస్టర్లు..అధికారులను టార్గెట్ చేస్తూ కాగజ్‌నగర్‌ పట్టణ కేంద్రంలో బ్యానర్
Follow us on

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. గత కొంత కాలంగా ఈ అడవి జిల్లాపై మావోయిస్టులు ఫోకస్ పెడుతున్నారు. అయితే వారి అంచనాలను ఎప్పటికప్పుడు పోలీసులు తిప్పకొడుతున్నారు. అయితే తాజాగా మావోయిస్టు పార్టీ పేరిట వెలిసిన పోస్టర్లు అలజడి సృష్టిస్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులను అక్కడికి చేరుకుని వాటిని తొలగించారు. ఈ సంఘటనపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

భూ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు అధికారులు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ మావోయిస్టు పార్టీ పేరిట కాగజ్‌నగర్‌ పట్టణ కేంద్రంలో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. కొత్త రెవెన్యూ చట్టాలను ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారి పైన భూములు మార్చకుండా పాతవారిని కొనసాగిస్తూ కావాలనే కొంతమంది అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పోస్టర్లో రాసుకొచ్చారు. అధికారులు ప్రజాప్రతినిధులు తమ తీరు మార్చుకోకపోతే సరైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించడం ఆందోళనకు గురి చేస్తోంది.