పృథ్వీ సిగ్గుపడాలి.. రైతులకు సారీ చెప్పాల్సిందే: పోసాని

| Edited By:

Jan 09, 2020 | 9:47 PM

అమరావతి రైతులను.. పృథ్వీ క్షమాపణ అడగాల్సిందేనని ఫైర్ అయ్యారు పోసాని కృష్ణమురళి. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను తిట్టడం సరికాదన్నారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులనడం.. పృథ్వీకి తగదని.. పృథ్వీలాంటి వారివల్లే జగన్ ప్రభుత్వానికి నష్టం కలుగుతోందని పేర్కొన్నారు. పృథ్వీ వెంటనే మీడియా సమావేశం పెట్టి.. రైతులకు క్షమాపణ చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు. రైతులను కించపరిచేలా ఎవరు మాట్లాడినా నేను సహించనని ఆయన చెప్పారు. రైతులకు కార్లు ఉంటే తప్పేంటి? అలాగే పంటను […]

పృథ్వీ సిగ్గుపడాలి.. రైతులకు సారీ చెప్పాల్సిందే: పోసాని
Follow us on

అమరావతి రైతులను.. పృథ్వీ క్షమాపణ అడగాల్సిందేనని ఫైర్ అయ్యారు పోసాని కృష్ణమురళి. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను తిట్టడం సరికాదన్నారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులనడం.. పృథ్వీకి తగదని.. పృథ్వీలాంటి వారివల్లే జగన్ ప్రభుత్వానికి నష్టం కలుగుతోందని పేర్కొన్నారు. పృథ్వీ వెంటనే మీడియా సమావేశం పెట్టి.. రైతులకు క్షమాపణ చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు.

రైతులను కించపరిచేలా ఎవరు మాట్లాడినా నేను సహించనని ఆయన చెప్పారు. రైతులకు కార్లు ఉంటే తప్పేంటి? అలాగే పంటను పండించే మహిళల చేతులకు బంగారు గాజులు ఉండకూడదా అంటూ.. పృథ్వీని ప్రశ్నించారు పోసాని. అలాగే.. జగన్ రైతులకు అన్యాయం చేయరని.. రైతులు శాంతించాలని ఆయన కోరారు. జగన్ తప్పక రైతులకు న్యాయం చేస్తారు. ఇప్పటివరకూ ప్రజల గురించి జగన్ ఒక్క మాట కూడా జారలేదన్నారు. కాగా.. అమరావతిలో రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జగన్‌కు ఇది నా విజ్ఞప్తి అంటూ పేర్కొన్నారు.

పృథ్వీ నీకూ.. నాకూ ఎలాంటి కక్షలు, విభేదాలు లేవు. నువ్వు నాకు తమ్ముడి లాంటి వాడివి. రైతులపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పడానికి మాత్రమే నేను వచ్చాను అంతే. నీ వ్యాఖ్యలతో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టిస్తాడని.. వ్యాఖ్యానించారు పోసాని కృష్ణ మురళి.