
ముంబయి భామ పూజా హెగ్డే ఊపు ఇప్పుడు మామూలుగా లేదు. ఆమె టాలీవుడ్లో ప్రస్తుతం మకుటం లేని మహారాణి. ఆల్రెడీ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్లతో ఆడి పాడేసింది. మిగతా బడా స్టార్లు కూడా ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తితో ఉన్నారు. మరే హీరోయిన్ కూడా పూజాకు దరిదాపుల్లో లేరిప్పుడు.
తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రభాస్-పూజాహెగ్డే కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్టు రాధేశ్యామ్. ఈ చిత్రానికి రాధాకృష్ణకుమార్ డైరెక్టర్. ఈ మూవీ నుంచి వస్తున్న ఒక్కో అప్ డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తాజాగా అందాల భామ పూజాహెగ్గే సెట్స్ లో నుంచి ఓ వీడియో తీసి ట్విటర్ లో పోస్ట్ చేసింది. అందరికీ హాయ్…నేను రాధేశ్యామ్ లో సెట్ లో ఉన్నాను. మీ కోసం పెద్ద సర్ ఫ్రైజ్ రేపు మీ ముందుకు రాబోతుంది. అప్పటివరకు వేచి ఉండండి అంటూ సెట్స్ లో తీసిన వీడియోను యూవీ క్రియేషన్స్ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
Something exciting coming up tomorrow ! ☺️ Watch this space ?❤️ #RadheShyamSurprise #DontKeepCalm pic.twitter.com/sFx3XTCk1c
— Pooja Hegde (@hegdepooja) October 20, 2020