ఉత్తరప్రదేశ్‌లో భారీగా నిషేధిత మారణాయుధాలు పట్టుబడ్డాయి. బులంద షహర్‌లో ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇవి బయటపడ్డాయి. 405 నాటు తుపాకులు, 24 పిస్టోల్స్, 739 బుల్లెట్‌లను పోలీసులు సీజ్ చేశారు. పెద్ద ఎత్తున అక్రమ ఆయుధాలు తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఐదారు టీమ్‌లుగా విడిపోయిన పోలీసు బృందాలు.. పక్కా సమాచారంతో రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచిన తుపాకులను గుర్తించారు. వీటిని అతి రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
Bulandshahr: Police seized huge quantity of weapons and liquor during regular checking in the district yesterday. SSP N Kolanchi says, “405 illegal weapons, 739 cartridges, liquor worth Rs 2 Crore, Rs 1.5 Crore cash have been seized. We will continue checking like this.” pic.twitter.com/kknhKXW2YG
— ANI UP (@ANINewsUP) April 16, 2019