టెన్షన్‌ టెన్షన్‌గా చంద్రబాబు తిరుపతి పర్యటన.. ఏం జరుగుతుందో!

| Edited By:

Jan 11, 2020 | 4:28 PM

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన.. ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మొదటి నుంచీ ఆయన ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పోలీసులు చెబుతున్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలతో చంద్రబాబు మరోసారి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో.. మొదట నిర్ణయించిన రూట్లోనే ర్యాలీ చేయాలని పార్టీ నేతలకు సూచించారు. పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించడం పట్ల  చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో సమావేశం అనంతరం ఆయన తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి […]

టెన్షన్‌ టెన్షన్‌గా చంద్రబాబు తిరుపతి పర్యటన.. ఏం జరుగుతుందో!
Follow us on

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన.. ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మొదటి నుంచీ ఆయన ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పోలీసులు చెబుతున్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలతో చంద్రబాబు మరోసారి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో.. మొదట నిర్ణయించిన రూట్లోనే ర్యాలీ చేయాలని పార్టీ నేతలకు సూచించారు. పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించడం పట్ల  చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో సమావేశం అనంతరం ఆయన తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి బహిరంగ సభకు బయలు దేరారు.

నాలుగు వారాలుగా రాజధాని అమరావతి కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో చంద్రబాబు అన్నదాతల ఆందోళనలకు మద్దతుగా.. పలు నిరసన సభలు, కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా సంక్రాంతి వేడుకల్ని సైతం రద్దు చేసుకున్న చంద్రబాబు ఇవాళ తిరుపతిలో అమరావతి జేఏసీ నిర్వహిస్తున్న ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొననున్నారు.

అయితే ..చంద్రబాబు ర్యాలీకి అనుమతి లేదంటున్నారు పోలీసులు. సంక్రాంతి పండుగ సీజన్‌ కావడంతో ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని తిరుపతి అర్బన్‌ ఎస్పీ చెబుతున్నారు. మరోవైపు పోలీసులు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తిరుపతిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతల్ని సైతం హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లాలో పలువురు టీడీసీ నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. ఐతేపల్లిలో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్‌ నరసింహయాదవ్‌ను గృహ నిర్బంధం చేశారు.