అమర్‌నాథ్ యాత్రపై ‘ఉగ్ర’ కన్ను.. చురుగ్గా 10మంది టెర్రరిస్ట్‌లు

పవిత్ర అమర్‌ నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ లోయలో మరోసారి దాడులు చేసేందుకు ఉగ్రవాదులు సిద్ధమయ్యారని ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు కశ్మీర్‌ లోయలో చురుగ్గా ఉన్న పదిమంది టెర్రరిస్ట్‌లను పేర్లను ప్రకటించారు. వారిలో లష్కర్ తోయిబాకు చెందిన వాసిమ్ అహ్మ్, రియాజ్ నైకు, ఐజాజ్ మాలిక్, మహమ్మద్ అష్రఫ్ ఖాన్, మెహరుద్దీన్, జహీద్ షేక్, జావేద్ మత్తు, వాశిమ్ ఓసామా జైషే మహ్మద్‌కు చెందిన హఫీజ్ ఒమర్ పేర్లు ఉన్నాయి. కాగా […]

అమర్‌నాథ్ యాత్రపై ‘ఉగ్ర’ కన్ను.. చురుగ్గా 10మంది టెర్రరిస్ట్‌లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 05, 2019 | 2:43 PM

పవిత్ర అమర్‌ నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ లోయలో మరోసారి దాడులు చేసేందుకు ఉగ్రవాదులు సిద్ధమయ్యారని ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు కశ్మీర్‌ లోయలో చురుగ్గా ఉన్న పదిమంది టెర్రరిస్ట్‌లను పేర్లను ప్రకటించారు. వారిలో లష్కర్ తోయిబాకు చెందిన వాసిమ్ అహ్మ్, రియాజ్ నైకు, ఐజాజ్ మాలిక్, మహమ్మద్ అష్రఫ్ ఖాన్, మెహరుద్దీన్, జహీద్ షేక్, జావేద్ మత్తు, వాశిమ్ ఓసామా జైషే మహ్మద్‌కు చెందిన హఫీజ్ ఒమర్ పేర్లు ఉన్నాయి. కాగా జూలై 1 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. బల్తాల్, పహల్గామ్ మార్గాల ద్వారా భక్తులను ఈ యాత్రను కొనసాగించవచ్చు.