Nellore court: కోర్టులో చోరీ కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో పాత నేరస్థులు

|

Apr 16, 2022 | 8:41 AM

నెల్లూరు కోర్టు(Nellore Court) లో చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిరువురిని పాత నేరస్థులుగా గుర్తించారు. కోర్టు బయట ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు...

Nellore court: కోర్టులో చోరీ కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో పాత నేరస్థులు
Nellore Court
Follow us on

నెల్లూరు కోర్టు(Nellore Court) లో చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిరువురిని పాత నేరస్థులుగా గుర్తించారు. కోర్టు బయట ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ఈ ఘటనలో ఏఏ పత్రాలు అపహరణకు గురయ్యాయి. చోరీ వెనుక ఎవరి హస్తం ఉందనే కోఁలో దర్యాప్తు చేపట్టారు. శిక్ష పడుతుందన్న భయంతో కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy) తనపై వేసిన కేసు పత్రాలను దొంగిలించారని మాజీమంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చాక దోపిడీలు, దుర్మార్గాలు పెరిగిపోయాయని నెల్లూరు(Nellore) జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్ అన్నారు. జగన్ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. కోర్టులకే భద్రత లేకపోతే ప్రజలకు ఏం భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై విచారణలో ఉన్న కేసు డాక్యుమెంట్లు చోరీ అయ్యాయన్న భరత్.. చోరీపై కాకాణి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ జరిగింది..

నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కేసులో పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలున్న సంచి అపహరణకు గురైనట్లు కోర్టు బెంచి క్లర్క్ స్థానిక చిన్నబజారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నెల్లూరు ( Nellore) కోర్టు సముదాయంలోని నాలుగో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో (Court) బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఓ కేసులో కీలకంగా మారిన పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఎత్తుకెళ్లారు. సమీపంలోని కాలువలో లభ్యమైన సంచిలో అందులో ఉండాల్సిన పలు డాక్యుమెంట్లు మాయమైనట్లు గుర్తించి.. దర్యాప్తు చేపట్టారు.

Also Read

PM Modi: 108 అడుగుల హనుమాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

Indian Soldier: అంతులేని ఆవేదన.. ఆర్మీ అధికారి ఆచూకీ చెప్పాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్..

Spices Effects In Summer: ఎండకాలంలో వీటిని తిన్నారంటే.. మరింత హిటెక్కిపోతారు జాగ్రత్త..!