జైషే మహమ్మద్ హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం!

ప్రముఖ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ‘రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోని రైల్వేస్టేషన్లపై దాడులు చేస్తామని’ ఓ లేఖలో హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జైషే మహమ్మద్ హెచ్చరికల దృష్ట్యా తాము రైల్వే పోలీసు ఫోర్సుతో కలిసి అన్ని రైల్వేస్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు జరిపినట్లు రైల్వే పోలీసు జోధ్‌పూర్ ఎస్పీ మమతా విష్ణోయ్ చెప్పారు. రైల్వేస్టేషన్లలో అనుమానాస్పదంగా ఉన్నవారిని కూడా తనిఖీలు చేశామని ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని ఎస్పీ మమతా పేర్కొన్నారు. రైల్వేస్టేషన్లపై దాడి చేస్తామన్న జైషే […]

జైషే మహమ్మద్ హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం!

Edited By:

Updated on: Apr 19, 2019 | 8:50 AM

ప్రముఖ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ‘రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోని రైల్వేస్టేషన్లపై దాడులు చేస్తామని’ ఓ లేఖలో హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జైషే మహమ్మద్ హెచ్చరికల దృష్ట్యా తాము రైల్వే పోలీసు ఫోర్సుతో కలిసి అన్ని రైల్వేస్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు జరిపినట్లు రైల్వే పోలీసు జోధ్‌పూర్ ఎస్పీ మమతా విష్ణోయ్ చెప్పారు. రైల్వేస్టేషన్లలో అనుమానాస్పదంగా ఉన్నవారిని కూడా తనిఖీలు చేశామని ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని ఎస్పీ మమతా పేర్కొన్నారు. రైల్వేస్టేషన్లపై దాడి చేస్తామన్న జైషే మహమ్మద్ లేఖతో భద్రతను కట్టుదిట్టం చేశామని ఎస్పీ మమతా వివరించారు.

Follow Us