రెండు నెలల పాటు సూర్యుడు మాయం, విటమిన్‌ డీ సంప్లిమెంట్స్‌ను రెడీ చేసుకున్న ప్రజలు

|

Nov 21, 2020 | 5:36 PM

రెండు రోజులపాటు సూర్యుడు కనిపించకపోతేనే అదోలా ఉంటుంది మనకు! మరి సుమారు రెండు నెలల పాటు ఆ ప్రత్యక్ష నారాయణుడు కనిపించకుండా ఉంటే ఎలా ఉంటుంది? మన సంగతి వదిలేద్దాం.. డీ విటమిన్‌ను మందుబిళ్లలతో తెచ్చుకుంటాం..! మరి చెట్లు చేమలు ఏమైపోవాలి? పోదురూ అలా ఎక్కడైనా జరుగుతుందా అని విసుక్కోకండి.. ధృవాల సంగతి వదిలేస్తే సూర్యుడు కనిపించకుండా పోయే ప్రదేశం ఒకటి భూమ్మీద ఉంది.. అమెరికాలో అలాస్కా ఉంది కదా! అక్కడ ఉన్న ఉట్‌కియాగ్విక్‌ పట్టణానికి ఇప్పుడు […]

రెండు నెలల పాటు సూర్యుడు మాయం, విటమిన్‌ డీ సంప్లిమెంట్స్‌ను రెడీ చేసుకున్న ప్రజలు
Follow us on

రెండు రోజులపాటు సూర్యుడు కనిపించకపోతేనే అదోలా ఉంటుంది మనకు! మరి సుమారు రెండు నెలల పాటు ఆ ప్రత్యక్ష నారాయణుడు కనిపించకుండా ఉంటే ఎలా ఉంటుంది? మన సంగతి వదిలేద్దాం.. డీ విటమిన్‌ను మందుబిళ్లలతో తెచ్చుకుంటాం..! మరి చెట్లు చేమలు ఏమైపోవాలి? పోదురూ అలా ఎక్కడైనా జరుగుతుందా అని విసుక్కోకండి.. ధృవాల సంగతి వదిలేస్తే సూర్యుడు కనిపించకుండా పోయే ప్రదేశం ఒకటి భూమ్మీద ఉంది.. అమెరికాలో అలాస్కా ఉంది కదా! అక్కడ ఉన్న ఉట్‌కియాగ్విక్‌ పట్టణానికి ఇప్పుడు వెళితే ఆ అనుభూతిని ఆస్వాదించవచ్చు.. మొన్న బుధవారం అక్కడి ప్రజలు మధ్యాహ్నం ఒకటిన్నరకు చివరి సూర్యోదయాన్ని చూశారు.. మళ్లీ వచ్చే ఏడాది జనవరి 23న వారికి సూర్యుడు కనిపిస్తాడు.. అంటే 66 రోజుల తర్వాతే వారు దినకరుడుని చూడగలరు.. ఈ రెండు నెలల పాటు అక్కడ పూర్తిగా అంధకారం ఉంటుంది.. దీన్ని పోలార్‌ నైట్‌ అంటారు.. ప్రతి సంవత్సరం ఆ పట్టణంలో ఉన్న 4.300 మంది ఇలాంటి అనుభూతినే పొందుతారు. అందుకు కారణం ఉట్‌కియాగ్విక్‌ 71.29 డిగ్రీల ఉత్తర ఆక్షాంశంపై ఉండటమే! దీని ప్ర‌త్యేక జియోలొకేష‌న్ కార‌ణంగా సుదీర్ఘ పోలార్ నైట్‌ను చూడాల్సి వ‌స్తుంది. శీతాకాలం స‌మ‌యంలో భూమి సూర్యుడికి దూరంగా వంగి ఉండ‌టం కార‌ణంగా పోలార్ స‌ర్కిళ్లలో మాత్ర‌మే ఈ పోలార్ నైట్స్ ఉంటాయి. మరి రెండు నెలల పాటు ఎండ లేకపోతే ఎలా అన్న డౌట్‌ అక్కర్లేదు. అక్కడివారు ముందు జాగ్రత్తగా విటమిన్‌ డీ సంప్లిమెంట్స్‌ను రెడీగా పెట్టుకుంటారు.. పగటి పూట కరెంట్‌ లైట్లు ఎలాగూ ఉంటాయి..