రాష్ట్రపతి భవన్‌లో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం..!

|

May 30, 2019 | 6:25 PM

దేశ ప్రధానిగా నరేంద్రభాయ్‌ దామోదర్‌దాస్‌ మోదీ ఇవాళ రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో పట్టాభిషేక కార్యక్రమం జరుగుతోంది. గతంలో ఎప్పుడూ జరగని రీతిలో ఆర్భాటంగా దీన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు సాధించడంలో ప్రధానపాత్ర పోషించిన మోదీ… పూర్తి మెజారిటీతో వరుసగా రెండోసారి కొలువుదీరుతున్న తొలి కాంగ్రెసేతర ప్రధాని కావడం విశేషం. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీల తర్వాత ఈ ఘనత మోదీ ఒక్కరికే దక్కింది. […]

రాష్ట్రపతి భవన్‌లో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం..!
Follow us on

దేశ ప్రధానిగా నరేంద్రభాయ్‌ దామోదర్‌దాస్‌ మోదీ ఇవాళ రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో పట్టాభిషేక కార్యక్రమం జరుగుతోంది. గతంలో ఎప్పుడూ జరగని రీతిలో ఆర్భాటంగా దీన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు సాధించడంలో ప్రధానపాత్ర పోషించిన మోదీ… పూర్తి మెజారిటీతో వరుసగా రెండోసారి కొలువుదీరుతున్న తొలి కాంగ్రెసేతర ప్రధాని కావడం విశేషం. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీల తర్వాత ఈ ఘనత మోదీ ఒక్కరికే దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారాన్ని మీరు కూడా లైవ్ లో చూడండి.